కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వడం లేదని భారీగా విమర్శలు రావడంతో ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో యంగ్‌స్టర్స్ రుతురాజ్ గైక్వాడ్, జగదీశన్‌లకు జట్టులో చోటు కల్పించాడు ధోనీ.
అయితే ముంబై టాప్ క్లాస్ బౌలింగ్ వల్లనే, లేక ధోనీ కామెంట్ల ప్రభావమో కానీ గత మ్యాచ్‌లో ఈ ఇద్దరూ డకౌట్ అయ్యారు.
అయినా ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకోవడంతో రుతురాజ్ గైక్వాడ్, జగదీశన్‌లకు మరో అవకాశం ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ...
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు యంగ్ ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్...
ఐపిఎల్‌లో అతి పిన్న వయసులో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్న నాలుగో ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు 23 ఏళ్ల రుతురాజ్ గైక్వాడ్...
51 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 65 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు కూడా గెలుచుకున్నాడు.
రుతురాజ్ ప్రదర్శనతో ధోనీని ట్రోల్ చేస్తున్నారు ఐపిఎల్ ఫ్యాన్స్... ‘ఈ మాత్రం స్పార్క్ సరిపోతుందా’ అంటూ ట్రోల్స్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.
అయితే తాను ఎందుకు అలా కామెంట్ చేయాల్సి వచ్చిందో మ్యాచ్ అనంతరం వివరణ ఇచ్చాడు మహేంద్ర సింగ్ ధోనీ...
‘మంచిగా ఆడనప్పుడు ఆ బాధ అలాగే ఉండిపోతుంది. గేమ్‌ని ఎంజాయ్ చేస్తుంటే పాయింట్ల పట్టికలో ఎక్కడ ఉన్నామనేది మ్యాటర్ కాదు. ఒకవేళ క్రికెట్‌ను ఎంజాయ్ చేయకుండా ఆడుతుంటే ఆ బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే ఆ వ్యాఖ్యలు చేశారు. వాటికి కుర్రాళ్లు రెస్పాండ్ అయిన విధానం నాకు నచ్చింది’ అన్నాడు మహేంద్ర సింగ్ ధోనీ.
అయితే రుతురాజ్ ఆడడం వల్లే ఆర్‌సీబీ కంటే ఎక్కువగా ధోనీ ఫీల్ అయ్యి ఉంటాడని, కెప్టెన్ కాబట్టి తన వ్యాఖ్యలకు ఏదో ఒక వివరణ ఇచ్చి సర్దిచెప్పుకున్నాడని అంటున్నారు కొందరు ధోనీ యాంటీ ఫ్యాన్స్...