టీమిండియా నిజంగా ఇంత బలంగా మారిందా... రోహిత్ శర్మ కెప్టెన్సీలో దిగ్విజయ యాత్రకు...

Published : Feb 28, 2022, 09:44 AM IST

ఐపీఎల్‌లో ఐదు సార్లు టైటిల్ గెలిచిన కెప్టెన్‌గా భారీ అంచనాలతో టీమిండియా సారథ్య బాధ్యతలు స్వీకరించాడు రోహిత్ శర్మ. పూర్తి స్థాయి కెప్టెన్‌గా రోహిత్ ఏ క్షణాన బాధ్యతలు తీసుకున్నాడో కానీ, అప్పటి నుంచి అపజయం అనే పదానికి అర్థమే తెలియనట్టు దూసుకుపోతోంది భారత జట్టు...

PREV
112
టీమిండియా నిజంగా ఇంత బలంగా మారిందా... రోహిత్ శర్మ కెప్టెన్సీలో దిగ్విజయ యాత్రకు...

న్యూజిలాండ్‌ను టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్ చేసిన భారత జట్టు, ఆ తర్వాత వెస్టిండీస్‌ను వన్డే, టీ20 సిరీస్‌లో, తాజాగా శ్రీలంకను కూడా వైట్ వాష్ చేసి పంపించింది...

212

అయితే నిజంగా రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు ఏ జట్టూ ఓడించలేనంత బలంగా తయారయ్యిందా? రోహిత్ కెప్టెన్సీలో అంతటి మ్యాజిక్ ఉందా?

312

వాస్తవానికి న్యూజిలాండ్‌కి ఉపఖండ దేశ పిచ్‌లపై పెద్దగా చెప్పుకోదగ్గ రికార్డు లేదు. పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో కూడా టీ20 సిరీస్‌ చిత్తుగా ఓడింది న్యూజిలాండ్...

412

అదీ కాకుండా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఫైనల్ ఆడి, మూడు రోజుల వ్యవధిలో భారత్‌లో సిరీస్ ఆడింది న్యూజిలాండ్ జట్టు... అలిసిపోయిన ప్లేయర్ల నుంచి ఇంత కంటే బెటర్ పర్ఫామెన్స్ ఆశించడం మరీ అత్యాశే అవుతుంది...

512

వెస్టిండీస్‌, భారత్‌లో సిరీస్ గెలిచి కొన్ని దశాబ్దాలు దాటింది. ఆండ్రే రస్సెల్, క్రిస్ గేల్ వంటి స్టార్ ప్లేయర్లు కూడా లేని వెస్టిండీస్‌, భారత్‌పై గెలవడానికి పట్టువిడవని పోరాటమే చేసింది...

612

ఇక శ్రీలంక జట్టు పరిస్థితి గురించి అందరికీ తెలిసిందే. కుమార సంగర్కర, దిల్షాన్, జయవర్థనే, లసిత్ మలింగ వంటి లెజెండరీ ప్లేయర్లు రిటైర్ అయిన తర్వాత లంక పరిస్థితి అధ్వాన్వంగా తయారైంది...

712

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో గ్రూప్ స్టేజ్‌లో స్కాట్లాండ్, ఐర్లాండ్, యూఏఈ వంటి జట్లతో పోటీ పడాల్సిన పరిస్థితి లంకది...

812

అలాంటి శ్రీలంక జట్టును క్లీన్ స్వీప్ చేయడం పెద్ద గొప్పేం కాదు. అదీకాకుండా రోహిత్ సేన వరుసగా గెలిచిన 12 మ్యాచులు కూడా స్వదేశంలో జరిగినవే...
 

912

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో కూడా స్వదేశంలో, విదేశాల్లో కూడా ద్వైపాక్షిక సిరీసుల్లో తిరుగులేని ఆధిపత్యం చూపించింది భారత జట్టు...

1012

అప్పుడు మూడు మ్యాచుల సిరీస్‌లో రెండు గెలిచి, ఓ మ్యాచ్‌ను ప్రత్యర్థికి ఇచ్చేవాళ్లు. ఇప్పుడు ఆ ఒక్క మ్యాచ్ కూడా ఇవ్వకుండా గెలుస్తోంది భారత జట్టు...

1112

ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి టాప్ క్లాస్ టీమ్‌లతో రోహిత్ సేన ఇప్పటిదాకా ఆడింది లేదు. అదీకాకుండా విదేశాల్లో ఒక్క సిరీస్ కూడా ఆడలేదు...

1212

సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో ఇలాంటి వైట్ వాష్‌లు సాధిస్తే... అప్పుడు భారత జట్టు నిజంగా పటిష్టంగా మారినట్టు చెప్పుకోవచ్చు అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...
 

Read more Photos on
click me!

Recommended Stories