అప్పుడు ఆడి ఉంటే వాళ్లే గెలిచేవాళ్లు, కానీ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు... ఐదో టెస్టుపై మొయిన్ ఆలీ..

First Published Jun 30, 2022, 12:50 PM IST

ఓ టెస్టు సిరీస్ ఫలితం తేలడానికి దాదాపు ఏడాది సమయం పట్టడం బహుశా ఇదేనేమో తొలిసారి. కరోనా కారణంగా గత ఏడాది సెప్టెంబర్‌లో జరగాల్సిన టెస్టు సిరీస్‌లో ఐదో టెస్టు అర్ధాంతరంగా వాయిదా పడి, జూలై 1న ప్రారంభం కాబోతుంది. అయితే ఈసారి టీమిండియాకి చుక్కలు చూపిస్తామని అంటున్నాడు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీ...

Joe Root-Moeen Ali

సెప్టెంబర్ 2021లో మాంచెస్టర్ వేదికగా జరగాల్సిన ఐదో టెస్టు... మ్యాచ్ ఆరంభానికి కొన్ని గంటల ముందు అర్ధాంతరంగా వాయిదా పడింది. నాలుగో టెస్టు సమయంలోనే భారత బృందంలో కరోనా కేసులు వెలుగుచూడడం, ఐదో టెస్టు సమయానికి ఆ సంఖ్య రెట్టింపు కావడంతో మాంచెస్టర్ టెస్టు ఆడకుండా యూఏఈ ఫ్లైట్ ఎక్కారు భారత క్రికెటర్లు...

ఆ సమయంలో కరోనా భయంతో కాదు, ఐపీఎల్‌కి కావాల్సిన ప్రిపరేషన్స్ కోసమే భారత జట్టు ఐదో టెస్టును ఆడకుండా తప్పుకుందని వార్తలు వచ్చాయి. ఈ కారణంగా జానీ బెయిర్‌స్టో, క్రిస్ వోక్స్, డేవిడ్ మలాన్ వంటి ఇంగ్లాండ్ క్రికెటర్లు, ఐపీఎల్ 2022 సీజన్ సెకండ్ ఫేజ్‌కి దూరంగా ఉన్నారు...

అప్పటికే నాలుగు టెస్టుల సిరీస్‌లో 2-1 తేడాతో ఉన్న భారత జట్టు, మాంచెస్టర్ టెస్టును షెడ్యూల్ ప్రకారం ఆడి ఉంటే... అప్పుడు రిజల్ట్ వారికి అనుకూలంగా వచ్చి ఉండేదని, ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేదని అంటున్నాడు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీ...

Moeen Ali

‘ఈ టెస్టు సిరీస్‌ గత ఏడాది ముగిసి ఉంటే, కచ్ఛితంగా టీమిండియా గెలిచి ఉండేది. ఎందుకంటే వాళ్లు అప్పుడు అత్యంత బలమైన జట్టుతో బరిలో దిగి టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇచ్చారు. అంతెందుకు నాలుగైదు వారాల క్రితం అడిగినా వాళ్లే గెలుస్తారని చెప్పేవాడిని...

Moeen Ali

కానీ ఇప్పుడు మాత్రం కాదు! ఎందుకంటే ఇప్పుడు మాత్రం ఇంగ్లాండ్ జట్టే గెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే వాళ్లు చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టు కనిపిస్తోంది. అప్పుడు ఐదో టెస్టుకి ముందు వాళ్లు నాలుగు టెస్టులు ఆడారు..

ఇప్పుడు వాళ్లకు ఈ టెస్టు మ్యాచ్‌కి ముందు సరైన టెస్టు ప్రాక్టీస్ లేదు. ఓ వార్మప్ మ్యాచ్ ఆడి, నెట్స్ సెషన్స్‌ ప్రాక్టీస్‌తోనే నేరుగా మ్యాచ్ ఆడబోతున్నారు. అదీకాక ఇప్పుడు మా ఆటతీరు చాలా మారింది...

ఎలా చూసినా నా ఉద్దేశంలో ఇప్పుడు భారత జట్టు కంటే ఇంగ్లాండ్ జట్టే ఫెవరెట్. మా టీమ్ మైండ్‌సెట్ మారింది. గత ఏడాదితో పోలిస్తే వరుసగా మూడు టెస్టులు గెలిచిన తర్వాత మరింత కాన్ఫిడెంట్‌గా ఐదో టెస్టు ఆడబోతున్నాం.. 

టీమిండియాకి అద్భుతమైన బౌలింగ్ అటాక్ ఉంది. అయితే కెఎల్ రాహుల్ గాయం కారణంగా తప్పుకోవడం వాళ్ల ఓపెనింగ్ యూనిట్ బలహీనపడింది. గత సిరీస్‌లో కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ కలిసి మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టారు.

కెఎల్ రాహుల్ లేకపోవడం టీమిండియా కచ్ఛితంగా ప్రభావం చూపుతుంది. రోహిత్ శర్మ కూడా మిస్ అయితే వాళ్లకి టెస్టు మ్యాచ్ గెలిచే అవకాశాలు లేనట్టే.. మా ఆటతీరులో చాలా మార్పు వచ్చింది. మరింత పాజిటివ్‌గా, మరింత అటాకింగ్‌తో ఆడుతున్నాం. ఇప్పుడు ఇంగ్లాండ్‌ని ఓడించడం టీమిండియాకి చాలా కష్టమైన పని...’ అంటూ కామెంట్ చేశాడు ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీ...
 

click me!