Kapil Dev: రాజకీయాల్లోకి కపిల్ దేవ్ ఎంట్రీ..? 83 ప్రపంచకప్ హీరో చెప్పిందిదే..

First Published May 23, 2022, 5:03 PM IST

Is kapil Dev Joining Politics: టీమిండియాకు తొలి వన్డే ప్రపంచకప్ అందించిన  కెప్టెన్, హర్యానా హరికేన్ కపిల్ దేవ్ రాజకీయాల్లోకి రాబోతున్నాడా..?  

టీమిండియా దిగ్గజ క్రికెటర్, 1983 వన్డే ప్రపంచకప్  లో భారత్ కు  తొలి ట్రోఫీ అందించిన కపిల్ దేవ్ రాజకీయాల్లోకి అడుగిడబోతున్నారా..?  కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ఇదే విషయమ్మీద చర్చ జోరుగా సాగుతున్నది. 

సామాజిక మాధ్యమాలలో  కపిల్ దేవ్ పలువురు రాజకీయ నాయకులతో కలిసి ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ అతడు ఫలానా పార్టీలో చేరబోతున్నాడని పోస్టులు కోకోల్లలుగా వస్తున్నాయి.

కపిల్ దేవ్.. బీజేపీలో చేరుతున్నారని, రాష్ట్రపతి కోటా లో ఆయన రాజ్యసభకు ఎన్నిక కాబోతున్నారని ఒక వర్గం ప్రచారం చేయగా మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కపిల్ కలిసున్న ఫోటోలను షేర్ చేస్తూ.. అతడు ఆప్ లో చేరబోతున్నాడని  కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. 

ఈ నేపథ్యంలో  కపిల్ దేవ్ స్వయంగా స్పందించాడు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదని.. అసలు తనకు వాటిపట్ల ఆసక్తి కూడా లేదని చెప్పుకొచ్చాడు. 

కపిల్ దేవ్ సామాజిక మాధ్యమాల వేదికగగా స్పందిస్తూ..‘నేను రాజకీయాల్లోకి చేరనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.  ఇవి పూర్తిగా అవాస్తవం. నేను ఏ రాజకీయ పార్టీతో టచ్ లో లేను. 

కొంతమంది ఇలా  ఫేక్ న్యూస్ ను స్ప్రెడ్ చేస్తుండటం బాధాకరం. ఒకవేళ నేను రాజకీయాల్లోకి వెళ్తే  ఆ విషయాన్ని నేనే మీ అందరికీ బహిరంగంగానే చెబుతాను..’ అని తెలిపాడు. కపిల్  పొలిటికల్ ఎంట్రీ పై ఇప్పుడే కాదు చాలా రోజుల నుంచి చర్చ జరుగుతున్నది. 2009 లో కూడా  కపిల్ రాజకీయాల్లోకి రావాలని పలు పార్టీల నాయకులు కపిల్ ను కోరారు. 

బెంగాల్ అసెంబ్లీలో భారత మాజీ క్రికెటర్లు మనోజ్ తివారి, అశోక్ దిండాలు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మనోజ్ తివారి బెంగాల్ లో  యువజన, క్రీడా సర్వీసుల శాఖ మంత్రిగా కూడా పనిచేస్తున్నారు. 

click me!