ఐపీఎల్ 2022 ప్లేఆఫ్స్‌కి 2 గంటల ఎక్స్‌ట్రా టైమ్! ఫైనల్ మ్యాచ్‌కి రిజర్వు డే... వాతావరణ మార్పులతో..

Published : May 23, 2022, 04:00 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ సుదీర్ఘ సీజన్ సజావుగా క్లైమాక్స్‌కి చేరిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఒకరిద్దరు ప్లేయర్లు కరోనా బారిన పడడం మినహా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఐపీఎల్ 2022 సీజన్‌ని నిర్వహించగలిగింది బీసీసీఐ...

PREV
19
ఐపీఎల్ 2022 ప్లేఆఫ్స్‌కి 2 గంటల ఎక్స్‌ట్రా టైమ్! ఫైనల్ మ్యాచ్‌కి రిజర్వు డే... వాతావరణ మార్పులతో..

మహారాష్ట్రలోని ముంబై, పూణే నగరాల్లో గ్రూప్ మ్యాచులు పూర్తి కావడంతో ప్లేఆఫ్స్ కోసం కోల్‌కత్తా చేరుకున్నాయి నాకౌట్ స్టేజీకి అర్హత సాధించిన నాలుగు జట్లు...  

29

అయితే 74 మ్యాచుల పాటు సాగిన సుదీర్ఘ సీజన్ కావడంతో ఐపీఎల్ 2022 సీజన్‌ ముగిసే సమయానికి వర్షాకాలం పలకరించేసింది. ముఖ్యంగా కోల్‌కత్తాలో ఆదివారం భారీ వర్షం కురిసింది...
 

39

గంటలకు 90 కి.మీ.ల వేగంతో ఈదురు గాలులు వీచడంతో ఈడెన్ గార్డెన్స్‌లో కొన్ని హోర్డింగులు కూడా విరిగిపోయాయి. స్వల్పంగా వస్తువులు కూడా ధ్వంసమయ్యాయి... 

49

అయితే వచ్చే వారం రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలియచేసింది. దీంతో ఐపీఎల్ 2022 సీజన్ ప్లేఆఫ్స్ మ్యాచులను సజావుగా నిర్వహించేలా కొన్ని ఏర్పాట్లు చేసింది బీసీసీఐ...

59

కోల్‌కత్తా‌లోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే క్వాలిఫైయర్ 1, ఎలిమినేటర్ మ్యాచులతో పాటు అహ్మదాబాద్‌లో జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచులకు రెండు గంటల రిజర్వు టైమ్‌ని కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది...

69

అంటే వర్షం కారణం లేదా వాతావరణం కారణంగా మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమైనా లేదా అంతరాయం కలిగినా ఓవర్లను కుదించాల్సిన అవసరం ఉండదు. 2 గంటలు పోయినా మ్యాచ్ పూర్తి ఓవర్లు నిర్వహించేలా ఈ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...

79
Image credit: PTI

అలాగే అహ్మదాబాద్‌లో జరిగే ఐపీఎల్ 2022 ఫైనల్‌ మ్యాచ్‌కి రిజర్వు డేని కేటాయించింది. షెడ్యూల్ ప్రకారం  మే 29న రాత్రి 8 గంటలకు ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే వర్షం కారణంగా లేదా మరేదైనా కారణాల వల్ల ఆ రోజు ఆట సజావుగా సాగకపోతే మే 30న కూడా ఫైనల్ మ్యాచ్‌ని పూర్తి చేసే అవకాశం ఉంటుంది...
 

89
Image Credit: PTI

ఐసీసీ వరల్డ్ కప్ ఈవెంట్స్‌కి మాత్రమే ఉండే ఎక్స్‌ట్రా టైమ్, రిజర్వు డే... ఐపీఎల్‌లోనూ తీసుకొచ్చింది బీసీసీఐ. మే 24న గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య క్వాలిఫైయర్ 1 జరగబోతుంటే, మే 25న లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది...

99

క్వాలిఫైయర్ 1లో ఓడిన జట్టు, ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో మే 27న క్వాలిఫైయర్ 2 మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్, మే 29న క్వాలిఫైయర్ 1 విజేతతో టైటిల్ పోరులో పాల్గొంటుంది... 

click me!

Recommended Stories