మారతాయి... త్వరలోనే అన్ని మారతాయి! నితీశ్ రాణా బాగా ఫీలైనట్టున్నాడే...

Published : May 23, 2022, 04:32 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచుల టీ20 సిరీస్‌కి జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్ వంటి కొత్త కుర్రాళ్లు ఈ సిరీస్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేయబోతున్నారు. అయితే ఈ జట్టులో చాలామంది పేర్లు లేకపోవడంపై పెద్ద చర్చే జరిగింది...

PREV
19
మారతాయి... త్వరలోనే అన్ని మారతాయి! నితీశ్ రాణా బాగా ఫీలైనట్టున్నాడే...

ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తూ, గత కొన్ని సీజన్లుగా మంచి పర్ఫామెన్స్ ఇస్తున్నాడు రాహుల్ త్రిపాఠి. దేశవాళీ టోర్నీల్లోనూ అదరగొడుతున్న రాహుల్ త్రిపాఠి, ఐపీఎల్ 2022 సీజన్‌లో 14 మ్యాచులు ఆడి 37.54 సగటుతో 158.23 స్ట్రైయిక్ రేటుతో 413 పరుగులు చేశాడు...

29
Rahul Tripathi

31 ఏళ్ల రాహుల్ త్రిపాఠికి ఈసారి కచ్ఛితంగా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసే అవకాశం దక్కుతుందని అనుకున్నారంతా. అయితే రాహుల్ త్రిపాఠికి మొండిచేయి చూపించారు సెలక్టర్లు...

39
Image Credit: Getty Images

అలాగే ఐపీఎల్‌లో గత 8 సీజన్లుగా ప్రతీ సీజన్‌లోనూ 400+ పరుగులు చేసి రికార్డు క్రియేట్ చేసిన భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కి కూడా ఈ సిరీస్‌లో అవకాశం దక్కలేదు...

49

ఐపీఎల్ 2022 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ తరుపున ఆరంగ్రేటం చేసి, పేస్, లైన్ అండ్ లెగ్త్‌తో పాటు 5.93 ఎకానమీ మెయింటైన్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరిచిన మోహ్సీన్ ఖాన్‌కి టీమిండియా సెలక్టర్ల నుంచి పిలుపు రావచ్చని భావించారు క్రికెట్ ఫ్యాన్స్...

59

ఐపీఎల్ 2022 సీజన్‌లో 8 మ్యాచులాడి 13.23 సగటుతో 13 వికెట్లు తీసిన మోహ్సీన్ ఖాన్‌కి సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్‌లో అవకాశం ఇవ్వలేదు సెలక్టర్లు...

69
Nitish Rana

వీళ్లంతా భారత జట్టులో చోటు దక్కకపోవడంపై పెద్దగా స్పందించలేదు. అయితే కేకేఆర్ బ్యాటర్ నితీశ్ రాణా మాత్రం భారత జట్టు నుంచి పిలుపు రానందుకు బాగా ఫీలైనట్టే కనిపిస్తున్నాడు...

79

భారత జట్టులో చోటు దక్కకపోవడంపై ట్విట్టర్ ద్వారా స్పందించాడు నితీశ్ రాణా... ‘పరిస్థితులన్నీ త్వరలోనే మారతాయి...’ అంటూ ఇన్‌డైరెక్ట్ ట్వీట్ చేశాడు ఈ కేకేఆర్ బ్యాటర్...  డైరెక్టుగా చెప్పకపోయినా ఈ ట్వీట్, టీమిండియాలో సెలక్ట్ కాకపోవడం గురించేనని అర్థం చేసుకుంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్..

89

రాహుల్ త్రిపాఠి, మోహ్సీన్ ఖాన్ ఇప్పటిదాకా టీమిండియా తరుపున ఆరంగ్రేటం చేయలేదు. అయితే గత ఏడాది శ్రీలంకలో పర్యటించిన భారత జట్టులో నితీశ్ రాణాకి చోటు దక్కింది...

99

టీమిండియా తరుపున ఓ వన్డే, రెండు టీ20 మ్యాచులు ఆడిన నితీశ్ రాణా, మొత్తంగా చేసింది 22 పరుగులే. ఫామ్‌లో లేని లంకపై కూడా పరుగులు చేయలేక, తీవ్రంగా నిరాశపరిచాడు రాణా... 

click me!

Recommended Stories