జస్ప్రిత్ బుమ్రా, ఐర్లాండ్ టూర్‌కి వెళ్తున్నాడా! తనకి తెలియదంటున్న కెప్టెన్ రోహిత్ శర్మ...

Chinthakindhi Ramu | Published : Jul 27, 2023 5:10 PM
Google News Follow Us

అప్పుడెప్పుడో ఏడాది కిందట ఆసియా కప్ 2022 టోర్నీకి ముందు గాయపడిన భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, ఇప్పటిదాకా కోలుకోలేదు. జస్ప్రిత్ బుమ్రా అప్పుడొస్తాడు? ఇప్పుడొస్తాడు? అని వార్తలు రావడం తప్ప, అతను రీఎంట్రీ ఇచ్చింది లేదు...

18
జస్ప్రిత్ బుమ్రా, ఐర్లాండ్ టూర్‌కి వెళ్తున్నాడా! తనకి తెలియదంటున్న కెప్టెన్ రోహిత్ శర్మ...
Jasprit Bumrah

గాయంతో ఆసియా కప్ 2022, టీ20 వరల్డ్ కప్ 2022, ఐపీఎల్ 2023 సీజన్‌కి దూరమైన జస్ప్రిత్ బుమ్రా, వచ్చే నెల ఐర్లాండ్ టూర్‌లో జరిగే టీ20 సిరీస్‌లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని ప్రచారం జరిగింది..

28

కొన్ని రోజుల కిందట ఆటగాళ్ల ఫిట్‌నెస్‌పై అప్‌డేట్స్ ఇచ్చిన బీసీసీఐ, జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ ఇద్దరూ కూడా వేగంగా కోలుకుంటున్నారని, ఇప్పటికే ఎన్‌సీఏలో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారని తెలిపింది. వీరితో కొన్ని ప్రాక్టీస్ మ్యాచులు ఆడించి, ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇవ్వబోతున్నట్టు స్టేట్‌మెంట్ విడుదల చేసింది..

38

‘జస్ప్రిత్ బుమ్రాకి ఎంతో అనుభవం ఉంది. అతని రీఎంట్రీ కోసం టీమ్ అంతా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం అతను చాలా సీరియస్ గాయంతో బాధపడుతున్నాడు. అయితే అతను ఐర్లాండ్ టూర్‌కి వెళ్తున్నాడా? లేదా? అనేది నాకు తెలీదు..

Related Articles

48

ఐర్లాండ్ టూర్‌కి వెళ్లే టీమ్‌ని ఇంకా బీసీసీఐ ప్రకటించలేదు. అప్పటిదాకా నాక్కూడా అతను ఐర్లాండ్ టూర్‌లో ఆడతాడా? లేదా? తెలీదు. ఒకవేళ అతనికి అవకాశం వస్తే మాత్రం మంచిదే..

58
Jasprit Bumrah

వన్డే వరల్డ్ కప్ 2023 సమయానికి అతను పూర్తిగా కోలుకోవాలని మేం కూడా కోరుకుంటున్నాం. సీరియస్ గాయం నుంచి కోలుకునే ప్లేయర్, మ్యాచ్‌ ఫిట్‌నెస్‌తో పాటు మ్యాచ్ ఫీలింగ్ సాధించడానికి చాలా సమయం పడుతుంది..

68

అతను గాయం నుంచి ఎంత త్వరగా కోలుకుంటాడనేదానిపైనే అంతా ఆధారపడి ఉంది. ఎన్‌సీఏ అధికారులతో మేం టచ్‌లోనే ఉన్నాం. అతని ఫిట్‌నెస్ గురించి పాజిటివ్ అప్‌డేట్స్‌ వస్తున్నాయి. వన్డే వరల్డ్ కప్ వంటి టోర్నీలకు బాగా అనుభవం ఉన్న ప్లేయర్ల అవసరం చాలా ఉంటుంది..

78
Jasprit Bumrah

అయితే గాయంతో కొంత మంది సీనియర్ ప్లేయర్లు, టీమ్‌కి దూరంగా ఉన్నారు. వారిలో ఎవరు వరల్డ్ కప్ ఆడతారో గుర్తించి, వాళ్లు ప్రపంచకప్‌కి ముందు వీలైనన్ని మ్యాచులు ఆడేలా ఏర్పాట్లు చేస్తాం. 

88

కనీసం 15-20 మంది ప్లేయర్లపై ఫోకస్ పెడితే, వారిలో నుంచి బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ తయారవుతుంది.. ఫిట్‌నెస్‌తో పాటు బిజీ షెడ్యూల్ కారణంగా కొత్త ప్లేయర్లు గాయపడినా వారికి రిప్లేస్‌మెంట్ సిద్ధంగా ఉండాలి...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. 

Read more Photos on
Recommended Photos