శుబ్‌మన్ గిల్ ఓ బిలో యావరేజ్ ప్లేయర్! విదేశాల్లో ఆడలేడు... జహీర్ ఖాన్ కామెంట్స్...

Published : Jul 27, 2023, 04:41 PM IST

రెండేళ్లలో టీమిండియాకి త్రీ ఫార్మాట్ ప్లేయర్‌గా మారిపోయాడు శుబ్‌మన్ గిల్. ఐసీసీ విడుదల చేసిన 2023 వన్డే వరల్డ్ కప్ ప్రోమోలో కూడా శుబ్‌మన్ గిల్, స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. అయితే విదేశాల్లో మాత్రం గిల్ పర్ఫామెన్స్ సరిగా లేదు..  

PREV
18
శుబ్‌మన్ గిల్ ఓ బిలో యావరేజ్ ప్లేయర్! విదేశాల్లో ఆడలేడు... జహీర్ ఖాన్ కామెంట్స్...

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2020-21 టోర్నీలో టెస్టు ఆరంగ్రేటం చేసి మెప్పించిన శుబ్‌మన్ గిల్, బ్రిస్బేన్‌లో జరిగిన నాలుగో టెస్టులో 91 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. టీమిండియా విజయంలో గిల్ చేసిన ఈ పరుగులు ఎంతో ఉపయోగపడ్డాయి..

28
Shubman Gill-Virat Kohli

అయితే ఆస్ట్రేలియాలో మెరిసిన శుబ్‌మన్ గిల్, వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021 ఫైనల్‌లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. గాయంతో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ నుంచి దూరమైన శుబ్‌మన్ గిల్, సౌతాఫ్రికా టూర్‌లోనూ ఆడలేదు..

38

2023 ఏడాదిలో బీభత్సమైన ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్, వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చాడు. శుబ్‌మన్ గిల్ స్వయంగా మూడో స్థానంలో ఆడాలని ఉందని రాహుల్ ద్రావిడ్‌తో చెప్పినట్టు రోహిత్ శర్మ కామెంట్ చేశాడు..

48

అయితే ఈ సిరీస్‌లో తొలి టెస్టులో 6 పరుగులు చేసి అవుటైన శుబ్‌మన్ గిల్, రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 10 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 29 పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో స్థానంలో వచ్చిన ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ అందుకుంటే గిల్ మాత్రం వేగంగా ఆడడానికి చాలా కష్టపడ్డాడు..

58
Sgubman Gill

‘నా వరకూ శుబ్‌మన్ గిల్‌కి 10కి 4 మాత్రమే వేస్తాను. 5 మార్కులు తెచ్చుకునేవాడు యావరేజ్ స్టూడెంట్ అయితే, శుబ్‌మన్ గిల్ బిలో యావరేజ్ ప్లేయర్. ఛతేశ్వర్ పూజారాని పక్కనబెట్టి, శుబ్‌మన్ గిల్‌‌ని మూడో స్థానంలో ప్రయత్నించింది టీమిండియా...

68
Shubman Gill

ఛతేశ్వర్ పూజారా ప్లేస్‌లో ఆడే ప్లేయర్‌ నుంచి ఈ రకమైన పర్ఫామెన్స్ అయితే అస్సలు ఆశించలేం. గిల్ నుంచి టీమిండియా ఏం ఆశిస్తుందో అతనికి బాగా తెలుసు. ఓపెనర్లు భారీ భాగస్వామ్యం నెలకొల్పి, మంచి ఫ్లాట్‌ఫాం నిర్మించాక శుబ్‌మన్ గిల్ ఫెయిల్ అయ్యాడు..

78

బాల్ చక్కగా బ్యాటు మీదకి వస్తోంది. ఎక్స్‌ట్రా బౌన్స్‌తో భారీ షాట్లు ఆడేందుకు అనువుగా ఉంది. అయినా శు‌‌బ్‌మన్ గిల్ బ్యాటింగ్‌లో టైమింగ్ కానీ, టెంపో కానీ కనిపించలేదు. 

 

88
Shubman Gill

విదేశాల్లో శుబ్‌మన్ గిల్‌ ఎన్నో పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అతని నుంచి టీమిండియా ఎంతో ఆశిస్తోంది. ముఖ్యంగా మూడో స్థానంలో ఆడాలని ఫిక్స్ అయితే దానికి తగ్గట్టుగా మైండ్‌సెట్ కూడా మారాలి..’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్.. 

Read more Photos on
click me!

Recommended Stories