సచిన్ టెండూల్కర్‌కీ, విరాట్‌కీ పోలికేంటి? కోహ్లీ గొప్ప ప్లేయరే కానీ... వెస్టిండీస్ లెజెండ్ షాకింగ్ కామెంట్స్..

Published : Jul 26, 2023, 05:44 PM IST

వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో సెంచరీ అందుకున్న విరాట్ కోహ్లీ, 76 అంతర్జాతీయ సెంచరీలు పూర్తి  చేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్‌ కంటే వేగంగా 500వ అంతర్జాతీయ మ్యాచుల్లో 76 సెంచరీలు అందుకున్నాడు విరాట్ కోహ్లీ. దీంతో మరోసారి సచిన్ టెండూల్కర్ వర్సెస్ విరాట్ కోహ్లీ చర్చ మొదలైంది..  

PREV
18
సచిన్ టెండూల్కర్‌కీ, విరాట్‌కీ పోలికేంటి? కోహ్లీ గొప్ప ప్లేయరే కానీ... వెస్టిండీస్ లెజెండ్ షాకింగ్ కామెంట్స్..

274 వన్డేల్లో 12,898 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ, ఇప్పటికే 46 సెంచరీ బాదేశాడు. మరో 102 పరుగులు చేస్తే, విరాట్ కోహ్లీ 13 వేల వన్డే పరుగులు పూర్తి చేసుకుంటాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ అందుకోబోయే బ్యాటర్ విరాట్ కోహ్లీయే..

28

విరాట్ కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్ 18,426 వన్డే పరుగులతో టాప్‌లో ఉంటే, కుమార సంగర్కర 14234, రికీ పాంటింగ్ 13704, సనత్ జయసూర్య 13430 పరుగులు చేసి టాప్ 4లో ఉన్నారు. అయితే వీరిలో రికీ పాంటింగ్ తప్ప మిగిలిన బ్యాటర్లు అందరూ 400లకు పైగా మ్యాచులు ఆడారు...

38

463 వన్డేలు ఆడిన సచిన్ టెండూల్క్ 49 సెంచరీలు చేసి అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్‌గా టాప్‌లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ, మరో 3 సెంచరీలు చేస్తే, సచిన్ రికార్డును సమం చేస్తాడు. మరో 4 కొడితే, వన్డేల్లో 50 సెంచరీలు బాదిన మొట్టమొదటి బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర లిఖిస్తాడు...

48

ఇప్పటికే విరాట్ కోహ్లీ 50వ వన్డే సెంచరీ కోసం ప్రోమో కూడా సిద్ధం చేసి పెట్టుకుంది స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్. దీంతో కొందరు కోహ్లీ ఫ్యాన్స్, విరాట్‌ని‌ ‘గాడ్ ఆఫ్ వైట్ బాల్ క్రికెట్’గా పేర్కొంటున్నారు. అయితే వెస్టిండీస్ మాజీ గ్రేట్ కర్ట్‌లీ ఆంబ్రోస్, ఈ పోలిక సరికాదంటున్నాడు...

58

‘సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ రెండు భిన్నమైన తరాలకు చెందినవాళ్లు. వాళ్లను పోల్చి చూడడం కరెక్ట్ కాదు. సచిన్ టెండూల్కర్ లెజెండరీ ప్లేయర్. క్రికెట్ ప్రపంచంలో అతను అన్నీ సాధించాడు. సచిన్ క్రికెట్ నాలెడ్జ్ అపారం. అతను ఆడిన విధానం చూస్తే క్రికెట్ ప్రపంచాన్ని ఏలడానికి వచ్చినట్టుగా ఉండేది..
 

68

అలాంటి వ్యక్తితో ఏ ప్లేయర్‌ని పోల్చకూడదు. క్రికెట్ వల్ల చాలామందికి గుర్తింపు వచ్చింది కానీ సచిన్ వల్లే క్రికెట్‌కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. విరాట్ కోహ్లీ నిజంగా గొప్ప క్రికెటరే. అందులో ఎలాంటి సందేహం లేదు..
 

78

మూడేళ్ల పాటు సెంచరీ చేయనప్పుడు విరాట్ కోహ్లీ పనైపోయిందని చాలా మంది అన్నారు. అయితే ఇలాంటి కష్టకాలాన్ని దాటినప్పుడు టాలెంటెడ్ ప్లేయర్, గొప్ప ప్లేయర్‌గా మారతాడు...

88

విరాట్ క్వాలిటీ ప్లేయర్. అతను సెంచరీ చేయడం చాలా సంతోషంగా ఉంది.. ఈ సెంచరీతో అతను చాలా మంది నోళ్లో మూయించాడు. భారత క్రికెట్‌కి అతను ఇంకా చాలా ఇవ్వాలి, ఎంతో చేయాలి... ’ అంటూ కామెంట్ చేశాడు వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఆంబ్రోస్.. 

Read more Photos on
click me!

Recommended Stories