ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ ఆడే జట్టులో ఎవరెవరికి చోటు దక్కుతుంది? టీమిండియా ఫ్యాన్స్‌ని వెంటాడుతున్న ప్రశ్న ఇదే. ఐపీఎల్ 2022 సీజన్‌లో అదరగొట్టిన దినేశ్ కార్తీక్‌కి టీ20 వరల్డ్ కప్‌లో చోటు దక్కుతుందా? లేదా?.. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఎదురుచూడాల్సిందే. అయితే తాజాగా టీ20 వరల్డ్ కప్ 2022 ఆడే భారత జట్టు ఎలా ఉంటే బాగుంటుందో తన అభిప్రాయం తెలియచేశాడు భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్...
కెఎల్ రాహుల్, రోహిత్ శర్మలను టీమిండియా ఓపెనర్లుగా సెలక్ట్ చేసిన ఇర్ఫాన్ పఠాన్, వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లీ, టూ డౌన్‌లో సూర్యకుమార్ యాదవ్‌లకు అవకాశం ఇచ్చాడు...
27
Image credit: PTI
ఐపీఎల్ 2022 సీజన్ ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్‌లకు టీ20 వరల్డ్ కప్ 2022 జట్టులో చోటు ఇచ్చిన ఇర్ఫాన్ పఠాన్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి కూడా అవకాశం ఇచ్చాడు...
37
Harshal Patel
పేసర్లుగా ఐపీఎల్ 2021 సీజన్ పర్పుల్ క్యాప్ విన్నర్ హర్షల్ పటేల్‌తో పాటు భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రాలను ఫాస్ట్ బౌలర్లుగా ఎంచుకున్న ఇర్ఫాన్ పఠాన్, స్పిన్ బౌలర్‌గా యజ్వేంద్ర చాహాల్‌కి చోటు ఇచ్చాడు...
47
ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా, ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ 7లో ఉన్న ఇషాన్ కిషన్‌కి ఇర్ఫాన్ పఠాన్ సెలక్ట్ చేసిన టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో ప్లేస్ దక్కలేదు...
57
Image credit: PTI
అలాగే భారత జట్టుకి ప్రధాన వికెట్ కీపర్‌గా మారిన రిషబ్ పంత్, కొన్నాళ్లుగా ఫామ్‌లో లేకపోవడంతో అతనికి ఇర్ఫాన్ పఠాన్ ఎంపిక చేసిన టీ20 వరల్డ్ కప్ 2022 టీమ్‌లో ప్లేస్ దక్కలేదు...
67
Mohammed Shami
ఇషాన్ కిషన్, రిషబ్ పంత్‌లతో పాటు టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత ఒక్క అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడని సీనియర్ పేసర్ మహ్మద్ షమీకి కూడా ఇర్ఫాన్ పఠాన్ జట్టులో చోటు దక్కలేదు...
77
ఇర్ఫాన్ పఠాన్ ఎంపిక చేసిన టీ20 వరల్డ్ కప్ 2022 జట్టు ఇది: కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యజ్వేంద్ర చాహాల్, జస్ప్రిత్ బుమ్రా