ఐపీఎల్‌లో బాగా ఆడినా పట్టించుకోలేదు, ఇక నన్ను సెలక్ట్ చేయరేమో... భారత సీనియర్ క్రికెటర్ ఆవేదన...

Published : Jun 20, 2022, 01:43 PM IST

ఒకప్పుడు దేశవాళీ టోర్నీల్లో పర్ఫామెన్స్ ఆధారంగా టీమిండియాలోకి పిలుపు వచ్చేది. అయితే ఇప్పుడు భారత జట్టులోకి రావాలంటే ఐపీఎల్ ఒక్కటే ఏకైక మార్గంగా మారిపోయింది. హార్ధిక్ పాండ్యా, జస్ప్రిత్ బుమ్రా, నటరాజన్, రాహుల్ త్రిపాఠి, ఆవేశ్ ఖాన్... ఇలా టీమిండియాలోకి వస్తున్నవారంతా ఐపీఎల్‌లో అదరగొట్టినవాళ్లే...

PREV
18
ఐపీఎల్‌లో బాగా ఆడినా పట్టించుకోలేదు, ఇక నన్ను సెలక్ట్ చేయరేమో... భారత సీనియర్ క్రికెటర్ ఆవేదన...
Image credit: PTI

ఐపీఎల్ 2022 సీజన్ పర్పామెన్స్ కారణంగా మూడేళ్ల తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు భారత సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్. అయితే ఇదే ఐపీఎల్‌లో రాణించినా భారత సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకి మాత్రం సెలక్టర్లు మొండి చేయి చూపించారు...

28

భారత మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ టెస్టు రిటైర్మెంట్ తర్వాత భారత జట్టుకి టెస్టుల్లో ప్రధాన వికెట్ కీపర్‌గా ఉంటూ వచ్చిన వృద్ధిమాన్ సాహా, ఆడిలైడ్ టెస్టు తర్వాత వెనకబడ్డాడు. రిషబ్ పంత్ టెస్టుల్లో ప్రధాన వికెట్ కీపర్‌గా మారడంతో సాహా, సెకండ్ ఆప్షన్ వికెట్ కీపర్‌గా ఉంటూ వచ్చాడు...

38

రిషబ్ పంత్‌కి గాయమైన, విశ్రాంతి ఇచ్చిన మ్యాచుల్లో వృద్ధిమాన్ సాహాకి అవకాశం దొరికేది. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్‌లో సాహా... ఓ హాఫ్ సెంచరీతో రాణించాడు. అయితే ఆ తర్వాత సాహాకి టీమిండియాలో చోటు కరువైంది...

48
Wriddhiman Saha

శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌కి వృద్ధిమాన్ సాహాని ఎంపిక చేయని సెలక్టర్లు, ఇంగ్లాండ్‌తో జరగబోయే ఐదో టెస్టుకి కూడా అతన్ని ఎంపిక చేయలేదు. ఐపీఎల్‌లో టైటిల్ గెలిచిన గుజరాత్ టైటాన్స్‌లో సభ్యుడిగా ఉన్న సాహా, 11 మ్యాచుల్లో 317 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి...

58

‘నాకు ఇకపై టీమిండియాలో చోటు ఉండకపోవచ్చు. ఇప్పటికే హెడ్ కోచ్, ఛీఫ్ సెలక్టర్ కూడా ఈ విషయాన్ని నాతో చెప్పారు. అయితే ఐపీఎల్ పర్ఫామెన్స్ కారణంగా నాకు జట్టులో చోటు వస్తుందేమో అనుకున్నా..
 

68
Wriddhiman Saha

ఇంగ్లాండ్‌ టూర్‌లో నాకు చోటు దక్కి ఉంటే, భవిష్యత్తులో సెలక్టర్లు నా వైపు చూస్తారు, నాకు అవకాశం ఇస్తారనే ఆశ ఉండేది. అయితే ఇప్పుడు ఆ ఆశలు కూడా లేవు. అయితే నేను క్రికెట్ ఆడడం మాత్రం మానను...

78

టీమిండియాకి ఆడలేకపోతే దేశవాళీ టోర్నీల్లో, ఐపీఎల్‌లో కొనసాగుతా. ఎంత కాలం ఆడగలనో అంత కాలం ఆటను మాత్రం విడిచి పెట్టను.. ఐపీఎల్‌ 2022లో నా పర్ఫామెన్స్ సంతృప్తినిచ్చింది...

88

గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలవడంలో నా వంతు పాత్ర నేను పోషించా. 2014 ఐపీఎల్ ఫైనల్‌లో నేను చేసిన సెంచరీ, నాకు చాలా స్పెషల్. అయితే అప్పుడు ఎక్కువ మ్యాచులు ఆడి, ఎక్కువ పరుగులు చేసినా టైటిల్ గెలవలేకపోయా... ఈసారి ఆ లోటు కూడా తీరిపోయింది...’ అంటూ చెప్పుకొచ్చాడు భారత సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా... 

click me!

Recommended Stories