ఐపీఎల్ 2022 సీజన్‌లో ఏ జట్టు ఎలా ఉంది... బలాలు, రివ్యూ, రేటింగ్ ఎలా ఉన్నాయంటే...

Published : Feb 14, 2022, 11:55 AM IST

ఐపీఎల్ 2022 మెగా వేలం ముగిసింది. 10 ఫ్రాంఛైజీలు కలిసి మొత్తంగా రూ. 551.7 కోట్లను ఖర్చు చేసి, 204 ప్లేయర్లను కొనుగోలు చేశాయి. వీరిలో 67 మంది విదేశీ ప్లేయర్లు కాగా, మిగిలిన వారంతా స్వదేశీ ప్లేయర్లే... ఇంతకీ వేలం ముగిసిన తర్వాత ఏ జట్టూ ఎలా ఉంది? బలమైన జట్టు ఏది?

PREV
110
ఐపీఎల్ 2022 సీజన్‌లో ఏ జట్టు ఎలా ఉంది... బలాలు, రివ్యూ,  రేటింగ్ ఎలా ఉన్నాయంటే...

సన్‌రైజర్స్ హైదరాబాద్: ఎస్‌ఆర్‌హెచ్ జట్టులో వేలం ముగిసిన తర్వాత 23 మంది ప్లేయర్లు ఉన్నారు. వీరిలో స్వదేశీ ప్లేయర్లు 15 మంది కాగా, విదేశీ ఆటగాళ్లు 8 మంది. కేన్ విలియంసన్, వాషింగ్టన్ సుందర్, నికోలస్ పూరన్, రాహుల్ త్రిపాఠి, అయిడిన్ మార్క్‌రమ్ వంటి ప్లేయర్లతో సన్‌రైజర్స్ బలంగా ఉన్నా, టీమ్ కాంబినేషన్‌ మాత్రం సరిగా సెట్ కానట్టే కనిపిస్తోంది. కుర్రాళ్లతో నిండిన జట్టులో అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తోంది...


సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఏషియా నెట్ ఇచ్చే రేటింగ్: 6.5/10

210

పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్‌ను రిటైన్ చేసుకున్న పంజాబ్ కింగ్స్, శిఖర్ ధావన్, బెయిర్ స్టో, షారుక్ ఖాన్, లియామ్ లివింగ్‌స్టోన్ వంటి స్టార్లను వేలంలో కొనుక్కుంది. అర్ష్‌దీప్ సింగ్, రబాడా, సందీప్ శర్మ, హర్‌ప్రీత్ బార్, రాజ్ భవ వంటి ప్లేయర్లతో పటిష్టంగా కనిపిస్తోంది పంజాబ్... గతంతో పోలిస్తే ఈసారి పంజాబ్ కింగ్స్ జట్టు బలంగానే కనిపిస్తోంది...

పంజాబ్ కింగ్స్‌కి ఏషియా నెట్ ఇచ్చే రేటింగ్: 7.9/10

310

రాజస్థాన్ రాయల్స్:  సంజూ శాంసన్‌, యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్‌లను అట్టిపెట్టుకున్న రాయల్స్, దేవ్‌దత్ పడిక్కల్, సిమ్రాన్ హెట్మయర్, జేమ్స్ నీశమ్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిద్ధ్ కృష్ణ, యజ్వేంద్ర చాహాల్, నవ్‌దీప్ సైనీ, నాథన్ కౌంటర్ నైల్, రవి అశ్విన్‌ వంటి స్టార్లను వేలంలో తెచ్చుకుంది. రాయల్స్ గతంలో కంటే చాలా మెరుగైనట్టే కనిపిస్తోంది.

రాజస్థాన్ రాయల్స్‌కి ఏషియా నెట్ ఇచ్చే రేటింగ్: 8/10

410

గుజరాత్ టైటాన్స్: ఐపీఎల్‌లో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న గుజరాత్ టైటాన్స్ హార్ధిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుబ్‌మన్ గిల్‌లను డ్రాఫ్ట్‌లుగా ఎంచుకుంది. రాహుల్ తెవాటియా, మహ్మద్ షమీ, లూకీ ఫర్గూసన్, జాసన్ రాయ్, డేవిడ్ మిల్లర్, విజయ్ శంకర్ వంటి స్టార్లను వేలంలో కొనుక్కుంది. అయితే హార్ధిక్ పాండ్యా జట్టును ఎలా నడిపిస్తాడు? ఈ ప్లేయర్లను ఎలా ఉపయోగిస్తాడనేది ఇప్పుడే చెప్పలేం...

గుజరాత్ టైటాన్స్‌కి ఏషియా నెట్ ఇచ్చే రేటింగ్: 6.5/10

510

లక్నో సూపర్ జెయింట్స్: భారీ మొత్తాన్ని చెల్లించి జట్టును దక్కించుకున్న లక్నో, వేలంలో అదే దూకుడు చూపించింది. కెఎల్ రాహుల్, స్టోయినిస్, రవిభిష్ణోయ్‌లను డ్రాఫ్ట్‌లుగా కొనుగోలు చేసిన లక్నో, క్వింటన్ డి కాక్, జాసన్ హోల్డర్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, ఆవేశ్ ఖాన్, మార్క్ వుడ్ వంటి స్టార్లను వేలంలో కొనుగోలు చేసింది. ఆన్ పేపర్ స్ట్రాంగ్‌గానే కనిపిస్తున్నా లక్నో జట్టులో మొత్తంగా 21 మంది ప్లేయర్లే ఉన్నారు. అయితే టీమ్ కాంబినేషన్‌ని కానీ, మ్యాచ్ విన్నర్లను కొనుగోలు చేయడంలో విఫలమైంది లక్నో సూపర్ జెయింట్...

లక్నో సూపర్ జెయింట్‌కి ఏషియా నెట్ ఇచ్చే రేటింగ్: 5/10

610

చెన్నై సూపర్ కింగ్స్: ఐపీఎల్ 2021 టైటిల్ గెలిచిన జట్టులోని ప్లేయర్లను తిరిగి తెచ్చుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది సీఎస్‌కే. ధోనీ, జడేజా, రుతురాజ్, రాబిన్ ఊతప్ప, మొయిన్ ఆలీ, బ్రావో, రాయుడు, దీపక్ చాహార్, జగదీశన్ వంటి పాత ప్లేయర్లను తెచ్చుకున్న చెన్నై, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, క్రిస్ జోర్డాన్, శివమ్ దూబే, డివాన్ కాన్వే వంటి ప్లేయర్లను కొనుగోలు చేసింది. ఐపీఎల్ 2021 సీజన్‌తో పోలిస్తే ఈసారి చెన్నై జట్టు మరింత బలంగా కనిపిస్తోంది...

చెన్నై సూపర్ కింగ్స్‌ జట్టుకి ఏషియా నెట్ ఇచ్చే రేటింగ్: 8.5/10

710

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, సిరాజ్‌లను అట్టిపెట్టుకున్న ఆర్‌సీబీ, ఫాఫ్ డుప్లిసిస్, దినేశ్ కార్తీక్, హర్షల్ పటేల్, హసరంగ, హజల్ వుడ్, దినేశ్ కార్తీక్ వంటి ప్లేయర్లను వేలంలో తెచ్చుకుంది. ఆన్ పేపర్ స్టార్లతో నిండిన, టీమ్ కాంబినేషన్‌ను పట్టించుకోలేదు ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్. ఫాఫ్ డుప్లిసిస్‌కే ఆర్‌సీబీ కెప్టెన్సీ దక్కే అవకాశం ఉంది... ఆర్‌సీబీ గతంలో కంటే వీక్‌గానే కనిపిస్తోంది...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి ఏషియా నెట్ ఇచ్చే రేటింగ్: 6/10

810

కోల్‌కత్తా నైట్‌రైడర్స్: ఆండ్రూ రస్సెల్, వెంకటేశ్ అయ్యర్, సునీల్ నరైన్ వంటి ఆల్‌రౌండర్లను, వరుణ్ చక్రవర్తిని అట్టిపెట్టుకున్న కేకేఆర్, శ్రేయాస్ అయ్యర్, అజింకా రహానే, అలెక్స్ హేల్స్, నితీశ్ రాణా, సామ్ బిల్లింగ్స్, శివమ్ మావి, టిమ్ సౌథీ, ప్యాట్ కమ్మిన్స్, మహ్మద్ నబీలను వేలంలో కొనుగోలు చేసింది. మ్యాచ్ విన్నర్లు పుష్కలంగా ఉన్నా, టీమ్ కాంబినేషన్‌ ఎలా ఉంటుందనేది కేకేఆర్ విజయావకాశాలను డిసైడ్ చేయనుంది...

కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి ఏషియా నెట్ ఇచ్చే రేటింగ్: 7.5/10

910

ఢిల్లీ క్యాపిటల్స్: రిషబ్ పంత్, పృథ్వీషా, నోకియా, అక్షర్ పటేల్‌లను అట్టిపెట్టుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, లుంగి ఇంగిడి, శార్దూల్ ఠాకూర్, మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, కెఎస్ భరత్, యశ్ ధుల్,చేతన్ సకారియా, కుల్దీప్ యాదవ్, రొవ్‌మన్ పావెల్, టిమ్ సిఫర్ట్ వంటి ప్లేయర్లను వేలంలో కొనుక్కుంది. ఢిల్లీ జట్టు కూడా గతంలో కంటే బలంగా కనిపిస్తోంది... అయితే శిఖర్ ధావన్, ఆవేశ్ ఖాన్, రబాడా వంటి మ్యాచ్ విన్నర్లను మిస్ చేసుకుంది ఢిల్లీ...

ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఏషియా నెట్ ఇచ్చే రేటింగ్: 8.5/10

1010

ముంబై ఇండియన్స్: ఐదుసార్లు టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, కిరన్ పోలార్డ్, జస్ప్రిత్ బుమ్రా వంటి కోర్ ప్లేయర్లను తిరిగి తెచ్చుకుంది. టిమ్ డేవిడ్, డేవాల్డ్ బ్రేవిస్, రిలే మెడెరిత్, ఫ్యాబియన్ ఆలెన్, డానియల్ సామ్స్, జోఫ్రా ఆర్చర్ వంటి ప్లేయర్లను కొనుగోలు చేసిన ముంబై, మురుగన్ అశ్విన్, బాసిల్ తంపి, జయ్‌దేవ్ ఉనద్కడ్, మయాంక్ మర్కండే వంటి స్వదేశీ బౌలర్లను తెచ్చుకుంది. కోర్‌ టీమ్‌పైనే ఆశలు పెట్టుకున్న ముంబై, యువ క్రికెటర్ల నుంచి ఎలాంటి పర్ఫామెన్స్ రాబడుతుందనేది ఆసక్తికరంగా మారింది.. హార్ధిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, ట్రెంట్ బౌల్ట్  వంటి ప్లేయర్లను మిస్ చేసుకున్న ముంబై, ఈసారి కాస్త బలం తగ్గినట్టే కనబడుతోంది.

ముంబై ఇండియన్స్ జట్టుకి ఏషియా నెట్ ఇచ్చే రేటింగ్: 7.9/10

click me!

Recommended Stories