చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి జట్టు ఇదే... మొదటి రోజు అలా, రెండో రోజు ఇలా! స్మార్ట్‌గా మారిన సీఎస్‌కే...

Published : Feb 14, 2022, 10:13 AM IST

ఐపీఎల్ 2022 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్, 25 మందిని కొనుగోలు చేసింది. మొదటి రోజు కేవలం నలుగురు ప్లేయర్లను కొనుగోలు చేసిన చెన్నై, రెండో రోజు అన్ని జట్ల కంటే స్మార్ట్‌గా ప్లేయర్లను కొనుగోలు చేసి జట్టును నింపుకుంది...

PREV
111
చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి జట్టు ఇదే... మొదటి రోజు అలా, రెండో రోజు ఇలా! స్మార్ట్‌గా మారిన సీఎస్‌కే...

రూ.48 కోట్లతో ఐపీఎల్ 2022 మెగా వేలానికి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్, 25 ప్లేయర్లను కొనుగోలు చేసిన తర్వాత కూడా రూ. 2.95 కోట్లు మిగుల్చుకోవడం విశేషం..  

211

ఎమ్మెస్ ధోనీ,రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ ఆలీలను రిటైన్ చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్, దీపక్ చాహార్‌ను రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. 

311

డివాన్ కాన్వేని రూ.కోటికి కొనుగోలు చేసిన సీఎస్‌కే, గత సీజన్‌లో నాకౌట్ మ్యాచుల్లో అదరగొట్టిన రాబిన్ ఊతప్పను రూ.2 కోట్లకు తిరిగి జట్టులోకి తెచ్చుకుంది..

411

అంబటి రాయుడిని రూ.6.75 కోట్లకు తిరిగి జట్టులోకి తెచ్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్, శివమ్ దూబేని రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది...

511

డ్వేన్ బ్రావో రూ.4.4 కోట్లకు కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్, మిచెల్ సాంట్నర్ రూ. 1.9 కోట్లకు దక్కించుకుంది... 

611

సుబ్రాన్షు సేనాపతిని రూ.20 లక్షలు, హరి నిశాంత్, ఎన్ జగదీశన్‌లను బేస్ ప్రైజ్‌కే దక్కించుకుంది సీఎస్‌కే... 

711

 క్రిస్ జోర్డాన్‌ను రూ.3.6 కోట్లకు కొనుగోలు చేసిన చెన్నై సూపర్ కింగ్స్, ఆడమ్ మిల్నేను రూ.1.9 కోట్లకు సొంతం చేసుకుంది. 

811

మహీశ్ తీక్షణ రూ.70 లక్షలు, డ్వేన్ పెట్రోరియస్‌‌కి రూ.50 లక్షలు, ప్రశాంత్ సోలంకికి రూ.1.2 కోట్లు చెల్లించనుంది చెన్నై సూపర్ కింగ్స్...

911

ఎం అసిఫ్, తుషార్ దేశ్‌పాండే,ముకేశ్ చౌదరి,సిమ్రాన్‌జీత్ సింగ్ వంటి అన్‌క్యాప్డ్ ప్లేయర్లని బేస్ ప్రైజ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్..

1011

అండర్-19 వరల్డ్ కప్ 2022 ఆల్‌రౌండర్ రాజవర్థన్ హంగార్కేరర్‌ని రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్...

1111

ఐపీఎల్ 2022 సీజన్‌కి చెన్నై సూపర్ కింగ్స్ పూర్తి జట్టు ఇది: ఎమ్మెస్ ధోనీ, రవీంద్ర జడేజా, దీపక్ చాహార్, మొయిన్ ఆలీ, అంబటి రాయుడు, రుతురాజ్ గైక్వాడ్, డ్వేన్ బ్రావో, శివమ్ దూబే, రాబిన్ ఊతప్ప, తుషార్ దేశ్‌పాండే, కెఎం అసిఫ్, రాజవర్థన్ హంగార్కేరర్, సిమర్‌జిత్ సింగ్, డివాన్ కాన్వే, డ్వేన్ పెట్రోరియస్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, సుబ్రాన్షు సేనాపతి, ముకేశ్ చౌదరి, ప్రశాంత్ సోలంకి, సి హరి నిశాంత్, ఎన్ జగదీశన్, క్రిస్ జోర్డాన్, కె భగత్ వర్మ, మహీశ్ తీక్షణ

Read more Photos on
click me!

Recommended Stories