ఐపీఎల్ 2022 మెగా వేలంలో అత్యధిక మొత్తం దక్కించుకున్న ప్లేయర్లు వీరే... టాప్‌లో ఇషాన్ కిషన్..

Published : Feb 13, 2022, 10:04 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌ మెగా వేలంలో అత్యధిక మొత్తం దక్కించుకున్న ప్లేయర్ల జాబితాలో టాప్ 5లో నలుగురు భారత క్రికెటర్లే ఉండడం విశేషం. ఐపీఎల్ వేలం చరిత్రలో మొట్టమొదటిసారిగా ముంబై ఇండియన్స్ ప్లేయర్‌, అత్యధిక మొత్తం దక్కించుకున్న ప్లేయర్‌గా టాప్‌లో నిలవడం విశేషం...

PREV
112
ఐపీఎల్ 2022 మెగా వేలంలో అత్యధిక మొత్తం దక్కించుకున్న ప్లేయర్లు వీరే... టాప్‌లో ఇషాన్ కిషన్..

ఇషాన్ కిషన్ రూ.15.25 కోట్లు వెచ్చించి మెగా వేలంలో కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్ జట్టు. ఐపీఎల్ వేలంలో రూ.10 కోట్లకు పైగా ఖర్చు చేయడం ముంబైకి ఇదే తొలిసారి...

212

స్టార్ ఆల్‌రౌండర్ దీపక్ చాహార్‌ను తిరిగి జట్టులోకి తెచ్చుకునేందుకు ఏకంగా రూ.14 కోట్లు ఖర్చు చేసింది డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్..

312

ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను మెగా వేలంలో రూ.12.25 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్. ఐపీఎల్ 2022 సీజన్‌లో కేకేఆర్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు అయ్యర్.

412

ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్‌ లియామ్ లివింగ్‌ స్టోన్‌ను మెగా వేలంలో రూ.11.5 కోట్లు వెచ్చించి కొనుగోలు చేిసంది పంజాబ్ కింగ్స్...

512

ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను మెగా వేలంలో రూ.10.75 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు...

612

ఐపీఎల్ 2021 పర్పుల్ క్యాప్ విన్నర్ హర్షల్ పటేల్‌ను రూ.10.75 కోట్లు చెల్లించి మరీ తిరిగి జట్టులోకి తీసుకుంది ఆర్‌సీబీ...

712

శ్రీలంక ఆల్‌రౌండర్ వానిందు హసరంగను మెగా వేలంలో రూ.10.75 కోట్లకు సొంతం చేసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు...

812

విండీస్ హిట్టర్ నికోలస్ పూరన్‌ను వేలంలో రూ.10.75 కోట్లు కొనుగోలు చేసింది సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు...

912

ఐపీఎల్ 2021 సీజన్‌లో 28 వికెట్లు తీసిన యంగ్ పేసర్ ఆవేశ్ ఖాన్‌ను రూ.10కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది లక్నో సూపర్ జెయింట్స్ జట్టు... 

1012

టీమిండియా యంగ్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణను మెగా వేలంలో రూ.10 కోట్లు చెల్లించి దక్కించుకుంది రాజస్థాన్ రాయల్స్...

1112

న్యూజిలాండ్ పేసర్ లూకీ ఫర్గూసన్‌ని ఐపీఎల్ 2022 మెగా వేలంలో రూ.10 కోట్లుకు దక్కించుకుంది గుజరాత్ టైటాన్స్ జట్టు.

1212

ఐపీఎల్ 2020 సీజన్‌లో పర్పుల్ క్యాప్ గెలిచిన కగిసో రబాడాని రూ.9.25 కోట్లకు కొనుగోలు చేసింది పంజాబ్ కింగ్స్..

click me!

Recommended Stories