ఆమె బ్యాటు, అతను బాల్! వరల్డ్ కప్ ఫైనల్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా మిచెల్ స్టార్క్, అలెస్సా హేలీ...

Published : Apr 03, 2022, 04:35 PM IST

డాక్టర్లు డాక్టర్లను, సినిమా హీరోలు, హీరోయిన్లను పెళ్లి చేసుకోవడం చాలా కామన్. అయితే క్రికెట్ ప్రపంచంలో ఇది చాలా అరుదు. ఆస్ట్రేలియా క్రికెట్ సెలబ్రిటీ దంపతులు మిచెల్ స్టార్క్, అలెస్సా హేలీ మాత్రం క్రికెట్ లవర్స్‌ని పర్ఫెక్ట్ కపుల్ గోల్స్ క్రియేట్ చేస్తున్నారు...  

PREV
18
ఆమె బ్యాటు, అతను బాల్! వరల్డ్ కప్ ఫైనల్‌లో స్పెషల్ అట్రాక్షన్‌గా మిచెల్ స్టార్క్, అలెస్సా హేలీ...

కొన్ని సంవత్సరాల పాటు ఆసీస్ వుమెన్స్ క్రికెటర్ అలెస్సా హేలీతో డేటింగ్ నడిపించిన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్, 2016లో ఆమెను వివాహం చేసుకున్నాడు...

28
Alyssa Healy

పెళ్లికి ముందు 2015 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌తో కలిసి సందడి చేసింది ఆలెస్సా హేలీ. వివాహం తర్వాత హేలీ ఆడే మ్యాచులకు హాజరవుతూ, భార్యను దగ్గరుండి ఉత్సహపరుస్తున్నాడు మిచెల్ స్టార్క్...

38

2020 వుమెన్స్ టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌ని కామెంటరీ బాక్సులో కూర్చొని వీక్షించాడు మిచెల్ స్టార్క్. స్టార్క్‌ని చూసిన ఉత్సాహంలో హేలీ ఆ మ్యాచ్‌లో 39 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచింది...

48

2022 వుమెన్స్ వన్డే వరల్డ్ కప్‌లోనూ సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో అలీసా హేలీ 138 బంతుల్లో 26 ఫోర్లతో 170 పరుగులు చేసి, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గా నిలిచింది...

58

2019 వన్డే వరల్డ్ కప్ టోర్నీలో 27 వికెట్లు తీసిన మిచెల్ స్టార్క్, మెన్స్ వరల్డ్ కప్ చరిత్రలో ఓ టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు...

68

2022 వుమెన్స్ వన్డే వరల్డ్ కప్‌లో 509 పరుగులు చేసిన అలెస్సా హేలీ, వుమెన్స్ వరల్డ్ కప్ చరిత్రలో ఒకే సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించింది...
 

78

భర్తతో పోటీపడుతూ వుమెన్స్ క్రికెట్‌లో అలెస్సా హేలీ రికార్డుల వరద కురిపిస్తుంటే, ఆమె విజయాన్ని చూసి మురుసిపోతున్నాడు మిచెల్ స్టార్క్...

88

వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీలో ఆస్ట్రేలియా మహిళా జట్టు, ఇంగ్లాండ్‌ను 71 పరుగుల తేడాతో ఓడించి ఏడోసారి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచింది. 

click me!

Recommended Stories