IPL2021 SRH vs PBKS: అదరగొట్టిన సన్‌రైజర్స్ బౌలర్లు... ఆరెంజ్ ఆర్మీ ముందు...

First Published Sep 25, 2021, 9:15 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో ప్లేఆఫ్ రేసు నుంచి దూరమైన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు, అదిరిపోయే పర్ఫామెన్స్‌తో కమ్‌బ్యాక్ ఇచ్చారు...  టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది...

తొలి వికెట్‌కి 26 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత 21 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో సుచిత్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

అదే ఓవర్‌లో 6 బంతుల్లో 5 పరుగులు చేసిన మయాంక్ అగర్వాల్ కూడా కేన్ విలియంసన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

17 బంతుల్లో ఓ ఫోర్‌తో 14 పరుగులు చేసిన క్రిస్ గేల్, రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత 4 బంతుల్లో ఓ సిక్సర్‌తో 8 పరుగులు చేసిన పూరన్, సందీప్ శర్మ బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు..

మార్క్‌రమ్‌ 32 బంతుల్లో 2 ఫోర్లతో 27 పరుగులు చేసి అబ్దుల్ సమద్ బౌలింగ్‌లో మనీశ్ పాండేకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు..

10 బంతుల్లో ఓ ఫోర్‌తో 13 పరుగులు చేసిన దీపక్ హుడాని సుచిత్ కళ్లు చెదిరే క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. మెరుపు వేగంతో పక్షిలా గాల్లోకి ఎగురుతూ సుచిత్ పట్టిన క్యాచ్, ఈ సీజన్‌లో బెస్ట్ క్యాచులలో ఒకటిగా నిలవడం ఖాయం...

ఆ తర్వాత 12 బంతుల్లో ఓ సిక్సర్‌తో 12 పరుగులు చేసిన నాథన్ ఎల్లీస్, భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో మనీశ్ పాండేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

భువీ వేసిన ఆఖరి ఓవర్‌లో ఫోర్ బాదిన హర్‌ప్రీత్ బ్రార్ 18 బంతుల్లో 18 పరుగులు చేసి... పంజాబ్ కింగ్స్ ఈ మాత్రం స్కోరు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు...

click me!