IPL2021: కెప్టెన్‌గా రిషబ్ పంత్ రికార్డుల మోత... రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్‌ల సరసన...

First Published Sep 25, 2021, 8:19 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో తొలిసారిగా కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్న యంగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ రికార్డుల మోత మోగిస్తూ దూసుకుపోతున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌పై ఈజీ విక్టరీ అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్... ఐపీఎల్ 2021 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన మొట్టమొదటి జట్టుగా నిలిచింది...

కెప్టెన్‌గా ఐపీఎల్ 2021 సీజన్‌లో బాధ్యతలు స్వీకరించిన రిషబ్ పంత్, తన తొలి 10 మ్యాచుల్లో 8 విజయాలు అందుకున్నాడు... రెండింట్లో ఓడింది ఢిల్లీ క్యాపిటల్స్..

తొలి 10 ఐపీఎల్‌ మ్యాచుల్లో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్‌గా రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్, షేన్ వార్న్, జార్జ్ బెయిలీ, కేన్ విలియంసన్‌ల సరసన నిలిచాడు రిషబ్ పంత్...

ముంబై కెప్టెన్‌గా రోహిత్ శర్మ... ఐదు టైటిల్స్ సాధించగా, కేకేఆర్ కెప్టెన్‌‌గా గౌతమ్ గంభీర్ రెండు టైటిల్స్ అందుకున్నాడు...  రాజస్థాన్ రాయల్స్‌ తొలి కెప్టెన్ షేన్ వార్నర్, మొదటి సీజన్‌లో టైటిల్ గెలిచాడు...

జార్జ్ బెయిలీ 2014 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ జట్టును తొలిసారి ఫైనల్ చేర్చగా, కేన్ విలియంసన్ కెప్టెన్సీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 2018లో ఫైనల్ చేరింది...

160 పరుగులలోపు లక్ష్యాన్ని కాపాడుకుంటూ విజయాన్ని అందుకోవడం ఢిల్లీ క్యాపిటల్స్‌కి ఐపీఎల్ చరిత్రలో ఇది నాలుగోసారి...

2009లో 150 పరుగులకు, 2012లో 152 పరుగులను కాపాడుకున్న ఢిల్లీ క్యాపిటల్స్, 2021లో 154 పరుగుల టార్గెట్‌ను కాపాడుకుని విజయం అందుకుంది. ఈ మూడుసార్లు ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్‌ కావడం విశేషం...

ఐపీఎల్ 2021 సీజన్‌లో 16 పాయింట్లు సాధించి, తొలిసారి ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన జట్టుగా నిలిచింది ఢిల్లీ క్యాపిటల్స్... ఇంతకుముందు 2009, 2012 సీజన్లలో ఈ ఫీట్ సాధించింది ఢిల్లీ డేర్‌డెవిల్స్...

ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 159 పరుగులు చేసి, ఆ స్కోరును కాపాడుకుంటూ విజయాన్ని అందుకున్న  ఢిల్లీ క్యాపిటల్స్... రాజస్థాన్ రాయల్స్‌పై 155 పరుగుల టార్గెట్‌ను కాపాడుకుంది. ఒకే సీజన్‌లో రెండుసార్లు 160లోపు స్కోర్లను కాపాడుకోవడం ఇది మొట్టమొదటిసారి...

డేవిడ్ మిల్లర్ వికెట్ తీసిన రవిచంద్రన్ అశ్విన్, టీ20 కెరీర్‌లో 250 వికెట్లు పూర్తిచేసుకున్నాడు. భారత బౌలర్లలో అమిత్ మిశ్రా 262, పియూష్ చావ్లా 262 వికెట్లతో రవిచంద్రన్ అశ్విన్ కంటే ముందున్నారు...

ఐపీఎల్‌లో మొదటి ఓవర్‌లోనే వికెట్ తీయడం, రవిచంద్రన్ అశ్విన్‌కి 39వ సారి... పియూష్ చావ్లా 37 సార్లు, హర్భజన్ 35, డీజే బ్రావో 34 సార్లు ఈ ఫీట్ సాధించారు..

ఈ మ్యాచ్‌లో రెండు క్యాచులు అందుకున్న రిషబ్ పంత్, ఐపీఎల్‌లో 50 వికెట్లలో భాగం పంచుకున్న మొట్టమొదటి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ కీపర్‌గా నిలిచాడు... 

కేకేఆర్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ 115 క్యాచులతో టాప్‌లో ఉండగా, 114 క్యాచులతో ఎమ్మెస్ ధోనీ రెండో స్థానంలో ఉన్నాడు. నామన్ ఓజా 65, పార్థివ్ పటేల్ 65, సాహా 59, రాబిన్ ఊతప్ప 58, ఆడమ్ గిల్‌క్రిస్ట్ 51 క్యాచులతో పంత్ కంటే ముందున్నారు..

click me!