IPL 2021: కుల్దీప్ యాదవ్‌లో ఈ కొంటె కోణం కూడా ఉందా... సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్...

First Published | Sep 30, 2021, 5:33 PM IST

భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, మోకాలి గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ కెప్టెన్సీలో జట్టులో కీ ప్లేయర్‌గా ఉన్న కుల్దీప్‌కి ఇప్పుడు తుదిజట్టులో చోటు దక్కడమే కష్టంగా మారింది...

వరుణ్ చక్రవర్తి అదరగొడుతుండడంతో గత సీజన్‌లో 5 మ్యాచులు మాత్రమే ఆడి, 12 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసే అవకాశాన్ని దక్కించుకున్న కుల్దీప్ యాదవ్, ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడుకుండానే దూరమయ్యాడు...

తొలి 10 మ్యాచుల్లో కుల్దీప్ యాదవ్‌కి తుదిజట్టులో చోటు దక్కలేదు. ఆ తర్వాత గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. కుల్దీప్ యాదవ్ మోకాలికి శస్త్ర చికిత్స నిర్వహించారు వైద్యులు...


‘సర్జరీ సక్సెస్‌ అయ్యింది. రికవరీ అవ్వడం మొదలెట్టేశాను కూడా. నాకు మద్ధతుగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు... గాయం నుంచి క్షేమంగా కోలుకోవడంపైనే ఫోకస్ పెట్టాను... త్వరలోనే పిచ్‌లో మళ్లీ అడుగుపెడతా...’ అంటూ పోస్టు చేశాడు కుల్దీప్ యాదవ్..

కుల్దీప్ యాదవ్ పోస్టుకి సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్ నటరాజన్, ఢిల్లీ స్పిన్నర్ అక్షర్ పటేల్, ఆర్‌సీబీ స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్, కేకేఆర్ ప్లేయర్ నితీశ్ రాణా... వంటి క్రికెటర్లు... త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు చేశారు..

అయితే వారికి ఎవ్వరికీ రిప్లై ఇవ్వని కుల్దీప్ యాదవ్, చాహాల్ భార్య ధనశ్రీ వర్మకు కూడా ‘థ్యాంక్యూ ధనా...’ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో కుల్దీప్ యాదవ్‌ను కొంటె కుర్రాడిగా అభివర్ణిస్తూ, సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి...

ఇలా జరుగుతుందని ముందుగానే గ్రహించాడో, లేక సోషల్ మీడియాలో మీమ్స్ చూసి అప్రమత్తమయ్యాడో తెలీదు కానీ, ఆ తర్వాత తన పోస్టుకి కామెంట్ చేసిన క్రికెటర్లందరికీ రిప్లై ఇచ్చాడు కుల్దీప్ యాదవ్...

అయితే దాదాపు అందరికీ కేవలం ఎమోజీలతో సమాధానం ఇచ్చిన కుల్దీప్ యాదవ్, సూర్యకుమార్ యాదవ్‌కి మాత్రం ‘త్వరలోనే నువ్వు మళ్లీ ఫామ్‌లోకి వస్తావ్...’ అంటూ ధైర్యం చెబుతూ రిప్లై ఇచ్చాడు...

కేకేఆర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గురించి ‘మెన్ విల్ బీ మెన్’ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న మీమ్స్ ఇవే...

కేకేఆర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గురించి ‘మెన్ విల్ బీ మెన్’ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న మీమ్స్ ఇవే....

కేకేఆర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గురించి ‘మెన్ విల్ బీ మెన్’ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న మీమ్స్ ఇవే...

కేకేఆర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గురించి ‘మెన్ విల్ బీ మెన్’ అంటూ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న మీమ్స్ ఇవే...

Latest Videos

click me!