ఐపీఎల్ 2021 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు...
ఈ రెండు జట్ల ఫస్టాఫ్‌లో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, ఆర్‌సీబీని చిత్తు చేస్తూ ఈజీ విజయాన్ని అందుకుంది.
26
ఇండియాలో జరిగిన ఆ మ్యాచ్‌లో పంజాబ్ బౌలర్ హర్‌ప్రీత్ బ్రార్ సంచలన స్పెల్‌తో విరాట్, ఏబీ డివిల్లియర్స్, మ్యాక్స్‌వెల్‌లను స్వల్ప స్కోర్లకే పెవిలియన్ చేర్చాడు...
36
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉన్న ఆర్‌సీబీ నేటి మ్యాచ్ గెలిస్తే, నేరుగా ఫ్లేఆఫ్స్‌కి అర్హత సాధిస్తుంది... ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ప్లేఆఫ్స్‌కి చేరుకోగా, ఆర్‌సీబీ మూడో జట్టుగా నిలుస్తుంది.
46
పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న పంజాబ్ కింగ్స్ నేటి మ్యాచ్‌లో ఓడితే, ప్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంటుంది... ప్రస్తుతం కోల్‌కత్తా, రాజస్థాన్, ముంబై జట్లతో ప్లేఆఫ్ బెర్త్ కోసం పోటీపడుతోంది పంజాబ్ కింగ్స్..