చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 190 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన రాజస్థాన్ రాయల్స్‌కి మెరుపు ఆరంభం అందించారు ఆర్ ఆర్ ఓపెనర్లు...
28
ఇవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్ బౌండరీల మోత మోగించడంతో 5 ఓవర్లలోనే 75 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్... 19 ఏళ్ల యశస్వి జైస్వాల్, అద్భుతమైన బౌండరీలతో సీఎస్‌కే బౌలర్లకు చుక్కలు చూపించాడు...
38
హజల్‌వుడ్ వేసిన ఐదో ఓవర్‌లో మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 22 పరుగులు రాబట్టిన యశస్వి జైస్వాల్, 19 బంతుల్లో తన మొట్టమొదటి హాఫ్ సెంచరీని అందుకున్నాడు...
48
రాజస్థాన్ రాయల్స్ తరుపున 2018లో జోస్ బట్లర్ (18 బంతుల్లో) తర్వాత ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు యశస్వి జైస్వాల్..
58
పవర్ ప్లేలోనే హాఫ్ సెంచరీ చేసిన ఆరో భారత బ్యాట్స్‌మెన్‌గా, మొదటి రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు యశస్వి జైస్వాల్.
ఐపీఎల్ 2021 సీజన్‌లో పవర్ ప్లేలో 50 కొట్టిన మొదటి ప్లేయర్‌గా నిలిచిన జైస్వాల్ ఇన్నింగ్స్ కారణంగా మొదటి 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...
88
ఐపీఎల్ కెరీర్‌లోనే రాజస్థాన్ రాయల్స్‌కి ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోరు. 2008 సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్‌పై కొట్టిన 73 పరుగులను అధిగమించింది ఆర్ఆర్...