IPL 2021: జైస్వాల్ దూకుడు, శివమ్ బాదుడు... భారీ టార్గెట్‌ను ఊదేసిన రాజస్థాన్ రాయల్స్...

First Published Oct 2, 2021, 11:22 PM IST

ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్... 190 పరుగుల భారీ టార్గెట్‌ను ముందు పెట్టిన టేబుల్ టాపర్ సీఎస్‌కే... అయితే కీలక మ్యాచ్‌లో సంచలన ప్రదర్శన ఇచ్చిన రాజస్థాన్ రాయల్స్, చెన్నైని చిత్తు చేసి 15 బంతులు మిగిలి ఉండగానే అద్భుత విజయాన్ని అందుకుంది... 

190 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన రాజస్థాన్ రాయల్స్‌కి మెరుపు ఆరంభం అందించారు ఆర్ ఆర్ ఓపెనర్లు...
ఇవిన్ లూయిస్, యశస్వి జైస్వాల్ బౌండరీల మోత మోగించడంతో 5 ఓవర్లలోనే 75 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్... 

హజల్‌వుడ్ వేసిన ఐదో ఓవర్‌లో మూడు సిక్సర్లు, ఓ ఫోర్‌తో 22 పరుగులు రాబట్టిన యశస్వి జైస్వాల్, 19 బంతుల్లో తన మొట్టమొదటి హాఫ్ సెంచరీని అందుకున్నాడు......

రాజస్థాన్ రాయల్స్ తరుపున 2018లో జోస్ బట్లర్ (18 బంతుల్లో) తర్వాత ఫాస్టెస్ట్ ఫిఫ్టీ బాదిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు యశస్వి జైస్వాల్..

పవర్ ప్లేలోనే హాఫ్ సెంచరీ చేసిన ఆరో భారత బ్యాట్స్‌మెన్‌గా, మొదటి రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు యశస్వి జైస్వాల్. ఇంతకుముందు 2011లో సన్నీ సోహల్, 2014లో రైనా, సాహా, 2018, 2019 సీజన్లలో కెఎల్ రాహుల్ ఈ ఫీట్ సాధించారు...

ఐపీఎల్ 2021 సీజన్‌లో పవర్ ప్లేలో 50 కొట్టిన మొదటి ప్లేయర్‌గా నిలిచిన జైస్వాల్ ఇన్నింగ్స్ కారణంగా మొదటి 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 81 పరుగులు చేసింది రాజస్థాన్ రాయల్స్...

ఐపీఎల్ కెరీర్‌లోనే రాజస్థాన్ రాయల్స్‌కి ఇదే అత్యధిక పవర్ ప్లే స్కోరు. 2008 సీజన్‌లో డెక్కన్ ఛార్జర్స్‌పై కొట్టిన 73 పరుగులను అధిగమించింది ఆర్ఆర్...  

12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 27 పరుగులు చేసిన లూయిస్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అవుట్ కాగా, 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 50 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, కెఎమ్ అసిఫ్ తన మొదటి బంతికే పెవిలియన్ చేర్చాడు...

ఆ తర్వాత సంజూ శాంసన్, శివమ్ దూబే కలిసి మూడో వికెట్‌కి 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. శివమ్ దూబే బౌండరీలతో విరుచుకుపడగా సంజూ శాంసన్ నెమ్మదిగా సింగిల్స్ తీస్తూ, అతనికి స్ట్రైయిక్ ఇవ్వడానికే ప్రాధాన్యం ఇచ్చాడు...

24 బంతుల్లో 4 ఫోర్లతో 28 పరుగులు చేసిన సంజూ శాంసన్, శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో అవుట్ కాగా గ్లెన్ ఫిలిప్‌తో కలిసి లాంఛనాన్ని ముగించాడు శివమ్ దూబే...

42 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులు చేసిన శివమ్ దూబే, గ్లెన్ ఫిలిప్ 8 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు..

click me!