ఐపీఎల్ 2021: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు... ఫేజ్ 2లో ఆర్‌సీబీ, వరుసగా మూడో మ్యాచ్‌లోనూ తొలుత బ్యాటింగ్ చేయనుంది...
ఫేజ్ 2లో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడాయి ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ముంబై మొదటి మ్యాచ్‌లో సీఎస్‌కే చేతుల్లో ఓడగా, ఆ తర్వాత కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమి పాలైంది...
27
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫేజ్ 2లో జరిగిన మొదటి మ్యాచులో ఘోరంగా విఫలమైంది. రెండో మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో కోహ్లీ, పడిక్కల్ రాణించినా ఆ తర్వాత బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో ఫెయిల్ అయ్యింది...
37
ఐపీఎల్ 2021 సీజన్‌లో జరిగిన ఓపెనింగ్ మ్యాచ్ ఆర్‌సీబీ, ముంబై ఇండియన్స్ మధ్యే జరిగింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేయగా 8 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి విజయాన్ని అందుకుంది ఆర్‌సీబీ...
47
విరాట్ కోహ్లీ మరో 13 పరుగులు చేస్తే, టీ20 ఫార్మాట్‌లో 10 వేల పరుగులు చేసిన మొట్టమొదటి భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేస్తాడు...
57
ప్రస్తుతం 397 సిక్సర్లతో ఉన్న రోహిత్ శర్మ, మరో 3 సిక్సర్లు బాదితే... టీ20 ఫార్మాట్‌లో 400 సిక్సర్లు కొట్టిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలుస్తాడు...