ఢిల్లీ క్యాపిటల్స్ టైటిల్ గెలిచిందా... రోహిత్ శర్మ స్థానంలో రిషబ్ పంత్‌కి టీ20 కెప్టెన్సీ...

First Published Oct 8, 2021, 6:24 PM IST

అదృష్టం వచ్చి హగ్ ఇచ్చేలోగా, బ్యాడ్‌లక్ వచ్చి లిప్‌లాక్ పెట్టిందంట... అల్లుఅర్జున్ నటించిన ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలోని ఈ డైలాగ్, రోహిత్ శర్మకు సరిగ్గా సెట్ అయ్యేలా కనిపిస్తోంది...

ఎన్నో ఏళ్లుగా టీమిండియా కెప్టెన్సీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నాడు రోహిత్ శర్మ. ఐపీఎల్‌లో ఐదుసార్లు టైటిల్ గెలవడమే కాకుండా, అప్పుడెప్పుడో టీమిండియాకి ఆసియా కప్‌ కూడా అందించాడు...

అయితే ఇన్నాళ్లూ మూడు ఫార్మాట్లలో సోలోగా విరాట్ కోహ్లీ ‘కింగ్’ రూల్ చేయడంతో రోహిత్ శర్మకు కెప్టెన్సీ అవకాశం దక్కలేదు...
(photo Source- Getty)

ఐపీఎల్ సెకండాఫ్ ప్రారంభానికి ముందు టీ20 వరల్డ్‌కప్‌ 2021 టోర్నీ తర్వాత టీ20 ఫార్మాట్‌లో కెప్టెన్‌గా కొనసాగనని ప్రకటించాడు విరాట్ కోహ్లీ... దీంతో టీ20 పగ్గాలు తీసుకోవడానికి రోహిత్ శర్మ రెఢీ అయిపోతున్నాడు కూడా...

8 సీజన్లలో ఐదుసార్లు ముంబై ఇండియన్స్‌ని ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలిపిన రోహిత్ శర్మకు టీ20 కెప్టెన్సీ దక్కడం నూటికి నూరుశాతం న్యాయం కూడా...

అయితే కెప్టెన్సీ పగ్గాలు తీసుకునేముందు ఐపీఎల్ 2021 సీజన్‌లో రోహిత్ శర్మకు ఊహించని షాక్ తగిలింది.  రోహిత్ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్, ప్లేఆఫ్స్‌కి కూడా అర్హత సాధించలేకపోయింది...

అదే సమయంలో తొలిసారి కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకున్న రిషబ్ పంత్, తన కెప్టెన్సీతో క్రికెట్ ఎక్స్‌పర్ట్స్‌ని మెప్పించాడు...

మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలోని సీఎస్‌కే జట్టును, రోహిత్ శర్మ కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ జట్లను రెండేసి సార్లు ఓడించింది రిషబ్ పంత్ కెప్టెన్సీలోని ఢిల్లీ క్యాపిటల్స్...

దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి టైటిల్ సాధిస్తే, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని టీ20 కెప్టెన్సీని రోహిత్ శర్మకు బదులు రిషబ్ పంత్‌కి అప్పగించాలని బీసీసీఐ పెద్దలు ఆలోచిస్తున్నట్టు సమాచారం...

ఇంతకుముందు వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో భారత జట్టు మూడు ఐసీసీ టైటిల్స్ సాధించింది. రిషబ్ పంత్ విషయంలోనూ అదే ఫార్ములా వర్కవుట్ అవుతుందని నమ్ముతున్నారట భారత క్రికెట్ బోర్డు సభ్యులు...

రిషబ్ పంత్ వయసు అతనికి ప్లస్ అవుతుండగా, రోహిత్ శర్మ వయసు కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడానికి మైనస్‌గా మారింది. 34 ఏళ్ల రోహిత్ శర్మ  మరో రెండుమూడేళ్లలో రిటైర్మెంట్ తీసుకోవడం ఖాయం. అప్పుడు మళ్లీ కొత్త కెప్టెన్ కోసం వెతక్కుండా 24 ఏళ్ల రిషబ్ పంత్‌కి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నారట క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

click me!