ఇలా ఆడితే విరాట్, రోహిత్ శర్మల కంటే అతనే తోపు ప్లేయర్... కెఎల్ రాహుల్‌పై గంభీర్ కామెంట్...

First Published Oct 8, 2021, 6:45 PM IST

క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విశ్లేషకుడిగా సెపరేట్ ఇమేజ్ తెచ్చుకున్నాడు గౌతమ్ గంభీర్. ఏ మ్యాచ్ గురించి, ఏ ప్లేయర్ గురించి గంభీర్ ప్రిడిక్షన్ చెబితే, దానికి పూర్తి రివర్స్‌లో రిజల్ట్ వస్తుందని ఫిక్స్ అయిపోయారు జనాలు...

తాజాగా పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ మాస్టర్ క్లాస్ ఇన్నింగ్స్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు గౌతమ్ గంభీర్...

సీఎస్‌కే విధించిన 135 పరుగుల లక్ష్యచేధనలో వన్ మ్యాన్ షోతో అదరగొట్టిన కెఎల్ రాహుల్, 42 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 98 పరుగులు చేసి పంజాబ్ కింగ్స్‌కి అద్భుత విజయాన్ని అందించాడు...

కెఎల్ రాహుల్ వీరబాదుడు కారణంగా కేవలం 13 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి, ప్లేఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకోవాలని ప్రయత్నించింది పంజాబ్ కింగ్స్...

‘ఇలా బ్యాటింగ్ చేస్తే, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కంటే కెఎల్ రాహుల్ తోపు ప్లేయర్ అవుతాడు. అయినా ఎందుకు ఇలా బ్యాటింగ్ చేయడో అర్థం కాదు...

నా ఉద్దేశంతో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల కంటే కెఎల్ రాహుల్‌లో టాలెంట్ చాలా ఉంది. నేను ఈరోజు అతని ఇన్నింగ్స్ చూసి ఈ కామెంట్స్ చేయడం లేదు...

అతన్ని చాలా రోజులుగా గమనిస్తున్నా కాబట్టి చెబుతున్నా... ఇండియాలో ఏ ప్లేయర్ దగ్గరా లేనన్ని షాట్స్, కెఎల్ రాహుల్ అమ్ములపొదిలో ఉన్నాడు... మరోసారి దాన్ని నిరూపించాడు...’ అంటూ వ్యాఖ్యానించాడు గౌతమ్ గంభీర్...

కడుపునొప్పి కారణంగా ఓ మ్యాచ్ ఆడని కెఎల్ రాహుల్, 13 మ్యాచుల్లో  62.60 సగటుతో 626 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో టాప్‌లో నిలిచాడు...

గత సీజన్‌లో 670 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న కెఎల్ రాహుల్‌కి ఈసారి సీఎస్‌కే ప్లేయర్లు డుప్లిసిస్, రుతురాజ్ గైక్వాడ్, శిఖర్ ధావన్‌ల నుంచి పోటీ పొంచిఉంది.

click me!