IPL2021: టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఈ స్కోరు మరీ చిన్నదేం కాకపోయినా 6 ఓవర్లలో 56 పరుగులు చేసిన జట్టు, ఇంత తక్కువ స్కోరుకి పరిమితం కావడం మాత్రం ముంబై ఫ్యాన్స్‌కి షాక్‌కి గురి చేసేదే...
ఓపెనర్లు రోహిత్ శర్మ, డికాక్ దూకుడుగా ఆడుతూ పవర్ ప్లేలోనే 56 పరుగులు జోడించారు. ముంబై ఇండియన్స్ భారీ స్కోరు చేసేలా కనిపించినా కోల్‌కత్తా నైట్‌రైడర్స్ బౌలర్లు అద్భుతంగా కమ్‌బ్యాక్ ఇచ్చారు...
27
Rohit Sharma-Photo Credit BCCI
కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌పై 1000+ పరుగులు, ఐపీఎల్ కెరీర్‌లో 5500+ పరుగులు పూర్తిచేసుకున్న రోహిత్ శర్మ... 30 బంతుల్లో 4 ఫోర్లతో 33 పరుగులు చేసి సునీల్ నరైన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
37
నరైన్ బౌలింగ్‌లో అవుట్ కావడం రోహిత్ శర్మకి ఇది ఏడో సారి... ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ 10 బంతుల్లో 5 పరుగులు చేసి, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
47
42 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేసిన డి కాక్, ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యాడు... 106 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది ముంబై ఇండియన్స్...
57
13 బంతుల్లో ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, లూకీ ఫర్గూసన్ బౌలింగ్‌లో రస్సెల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
67
ప్రసిద్ధ్ కృష్ణ వేసిన 18వ ఓవర్‌లో పోలార్డ్ ఓ సిక్స్, ఫోర్ బాదగా, నోబాల్, వైడ్లతో 18 పరుగులు ముంబై ఇండియన్స్ ఖాతాలో చేరాయి...
77
కిరన్ పోలార్డ్ 15 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 21 పరుగులు చేసి ఆఖరి ఓవర్‌లో రనౌట్ కాగా కృనాల్ పాండ్యా 9 బంతుల్లో ఓ సిక్స్‌తో 12 పరుగులు చేసి అవుట్ అయ్యాడు..