IPL 2021 KKR vs MI: ముంబై బౌలర్లకు చుక్కలు... కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి వరుసగా రెండో విజయం...

First Published Sep 23, 2021, 11:02 PM IST

ఐపీఎల్ 2021 ఫస్టాప్‌లో 152 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక, 10 పరుగుల తేడాతో ఓడిన కేకేఆర్... సెకండాఫ్‌లో ముంబైపై 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.  156 పరుగుల టార్గెట్‌ను కేవలం 15.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఈజీగా విజయాన్ని అందుకుంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

ఫేజ్2లో ముంబై ఇండియన్స్‌పై పూర్తి డామినేషన్ చూపించింది కేకేఆర్ టీమ్... 156 పరుగుల లక్ష్యఛేధనలో మెరుపు ఆరంభం అందించారు ఓపెనర్లు...

3 ఓవర్లలో 40 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత 9 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, బుమ్రా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు...

ఆ తర్వాత వెంకటేశ్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి కలిసి ముంబై ఇండియన్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. బౌలర్ ఎవరనేది కూడా పట్టించుకోకుండా ముంబై టాప్ క్లాస్ బౌలర్లను ఆటాడుకున్నారు...

30 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 53 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్, తన రెండో ఐపీఎల్ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు...

తొలి మ్యాచ్‌లో 40+ పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్, రెండో మ్యాచ్‌లో 50+ పరుగులు చేశాడు. 2008లో రాబిన్ ఊతప్ప, గ్రేమ్ స్మిత్, షాన్ మార్ష్ తర్వాత వరుస ఇన్నింగ్స్‌ల్లో 40+ పరుగులు చేసిన నాలుగో ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు వెంకటేశ్ అయ్యర్...

రెండో వికెట్‌కి 88 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత వెంకటేశ్ అయ్యర్ అవుట్ అయ్యాడు. అయ్యర్ అవుట్ అయిన తర్వాత కూడా రాహుల్ త్రిపాఠి దూకుడు కొనసాగించాడు...

8 బంతుల్లో ఓ సిక్స్‌తో 7 పరుగులు చేసిన ఇయాన్ మోర్గాన్ కూడా బుమ్రా బౌలింగ్‌లోనే అవుట్ కాగా, రాహుల్ త్రిపాఠి  42 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు... 

ఈ విజయంతో కేకేఆర్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకగా, వరుసగా రెండు పరాజయాలు నమోదుచేసిన ముంబై ఇండియన్స్ ఆరో స్థానానికి పడిపోయింది... ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్ చేరాలంటే మిగిలిన ఐదు మ్యాచుల్లో నాలుగు విజయాలు అందుకోవాల్సి ఉంటుంది.

click me!