IPL2021 MI vs DC: ముంబై బ్యాట్స్‌మెన్‌కి చుక్కలు చూపించిన ఢిల్లీ క్యాపిటల్స్... ముంబై కథ ముగిసినట్టేనా...

First Published Oct 2, 2021, 5:16 PM IST

ఆడుతున్నది ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్ డిఫెండింగ్ ఛాంపియన్ జట్టేనా... భారీ హిట్టర్లు, వరల్డ్ క్లాస్ స్టార్ ఆల్‌రౌండర్లు ఉన్నది ఈ జట్టులోనేనా... అని మ్యాచ్ చూస్తున్న ప్రతీ క్రికెట్ ఫ్యాన్‌కి డౌట్ వచ్చేలా సాగింది ముంబై ఇండియన్స్ బ్యాటింగ్... ఢిల్లీ, ముంబై మధ్య భారీ స్కోరింగ్ మ్యాచ్ చూడొచ్చని ఆశించిన ఐపీఎల్ ఫ్యాన్స్‌ని నిరుత్సాహపరుస్తూ, నెమ్మదిగా సా.... గింది ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్... 

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్, నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 129 పరుగులు మాత్రమే చేయగలిగింది.. 

బౌండరీతో ఇన్నింగ్స్ మొదలెట్టిన రోహిత్ శర్మను రెండో ఓవర్‌లోనే అవుట్ చేసి ఊహించని షాక్ ఇచ్చాడు ఢిల్లీ యంగ్ పేసర్ ఆవేశ్ ఖాన్. 10 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు రోహిత్...

ఐపీఎల్ 2021 ఫస్టాఫ్‌లో భారత సారథి విరాట్ కోహ్లీ, మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీలను అవుట్ చేసిన ఆవేశ్ ఖాన్, నేటి మ్యాచ్‌లో ఫ్యూచర్ టీ20 కెప్టెన్ రోహిత్ శర్మను పెవిలియన్ చేర్చడం విశేషం...

ఆ తర్వాత 18 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 19 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు... 37 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ముంబై...

ఫేజ్ 2లో గత మూడు ఇన్నింగ్స్‌ల్లో సింగిల్ డిజిట్ స్కోరుకే అవుటైన సూర్యకుమార్ యాదవ్, 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేసి ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు...

18 బంతుల్లో ఓ ఫోర్‌తో 15 పరుగులు చేసిన సౌరబ్ తివారి, అక్షర్ పటేల్ బౌలింగ్‌లో అవుట్ కాగా 9 బంతుల్లో 6 పరుగులు చేసిన కిరన్ పోలార్డ్‌ను నోకియా క్లీన్ బౌల్డ్ చేశాడు..

87 పరుగులకే 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది  ముంబై ఇండియన్స్... పోలార్డ్ అవుటైన తర్వాత 10 బంతుల్లో ఒక్క పరుగు కూడా రాకపోవడం విశేషం... 

18 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు చేసిన హార్ధిక్ పాండ్యాను ఆవేశ్ ఖాన్ క్లీన్ బౌల్డ్ చేశాడు... అదే ఓవర్‌లో కౌంటర్‌నైల్ కూడా క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 

వస్తూనే బౌండరీ బాదిన జయంత్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ వేసిన ఆఖరి ఓవర్‌లో మొదటి బంతికే భారీ సిక్సర్ బాదాడు. నాలుగు బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో  11 పరుగులు చేసిన జయంత్ యాదవ్, స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.  

ఆఖరి బంతికి సిక్సర్ కొట్టిన కృనాల్ పాండ్యా 15 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో 13 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు...

click me!