IPL2021: ఇక సురేష్ రైనా ఐపీఎల్ కెరీర్ ముగిసినట్టే... డేల్ స్టెయిన్ కామెంట్స్...

First Published Oct 2, 2021, 3:36 PM IST

ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లలో ఒకడిగా ఉన్న సురేష్ రైనా, ప్రస్తుతం చాలా ఇబ్బంది పడుతున్నాడు... ఇండియాలో జరిగిన ఫస్టాఫ్‌లో పర్వాలేదనిపించే ప్రదర్శన ఇచ్చినా, యూఏఈలో మాత్రం పరుగులు చేయడానికి కష్టపడుతున్నాడు...

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 పరుగులు చేసిన సురేష్ రైనా, ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో 17 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 11 పరుగులకు రనౌట్ అయిన రైనా, సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 పరుగులకే పెవిలియన్ చేరాడు...

మొత్తంగా యూఏఈలో జరిగిన నాలుగు మ్యాచుల్లో కలిపి 34 పరుగులు చేసిన సురేష్ రైనా, ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడడం క్రికెట్ ఫ్యాన్స్‌ని ఆశ్చర్యానికి గురి చేసింది...

‘ఇక సురేష్ రైనా, ఐపీఎల్ కెరీర్ ముగిసినట్టే అనిపిస్తోంది. ఐపీఎల్‌లో అతనో లెజెండ్. అతనికి అవకాశం రాదంటే నమ్మకం కాస్త కష్టమే... కానీ పరుగులు చేయకపోతే ఎలాంటి ప్లేయర్‌ అయినా రిజర్వు బెంచ్‌కి పరిమితం కావాల్సిందే...

డేవిడ్ వార్నర్ విషయంలో ఏం జరిగిందో చూశాం... అలాగే ఐపీఎల్‌లో చాలామంది ప్లేయర్ల విషయంలో కూడా ఇలాగే జరిగింది... ’ అంటూ కామెంట్ చేశాడు సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్...

ఐపీఎల్ కెరీర్‌లో 204 మ్యాచులు ఆడిన సురేష్ రైనా, ఓ సెంచరీ, 39 హాఫ్ సెంచరీలతో 5525 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో 5 వేల పరుగులు చేసిన మొట్టమొదటి ప్లేయర్‌గా నిలిచిన సురేష్ రైనాను 2018 వేలంలో రిటైన్ చేసుకుంది సీఎస్‌కే...

వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభానికి ముందు యూఏఈ నుంచి స్వదేశానికి వచ్చేసిన రైనా, ధోనీ ఆడకపోతే ఇండియన్ ప్రీమియర్ లీగ్ నుంచి తప్పుకుంటానని కామెంట్ చేశాడు...

‘ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వస్తున్న యంగ్ ప్లేయర్లను చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది. వాళ్లంతా వరల్డ్ క్లాస్ ప్లేయర్లు... టీ20 వరల్డ్‌కప్ తర్వాత రోహిత్ శర్మకి టీమిండియా కెప్టెన్సీ అప్పగిస్తే బాగుంటుంది...

ఐపీఎల్‌లో ఎన్నో అద్భుత విజయాలు అందుకున్న రోహిత్ శర్మ, సత్తా ఉన్న యంగ్ క్రికెటర్లను అద్భుతంగా వాడుకోగలడు...’ అంటూ కామెంట్ చేశాడు డేల్ స్టెయిన్... 

click me!