IPL2021 KKR vs RR: అదరగొట్టిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... రాజస్థాన్ రాయల్స్‌ ముందు భారీ టార్గెట్...

First Published Oct 7, 2021, 9:20 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో ప్లేఆఫ్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్ అదరగొట్టారు. బ్యాటింగ్‌కి కష్టసాధ్యంగా ఉన్న పిచ్‌ మీద 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది కేకేఆర్... రాజస్థాన్ రాయల్స్ టార్గెట్ 172 పరుగులు...

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌కి ఓపెనర్లు శుభారంభం అందించారు. 10.5 ఓవర్లలో 79 పరుగుల భాగస్వామ్యం అందించారు...

35 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 38 పరుగులు చేసిన వెంకటేశ్ అయ్యర్‌ను రాహుల్ తెవాటియా క్లీన్‌బౌల్డ్ చేశాడు...

ఆ తర్వాత 5 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్‌ బాదిన నితీశ్ రాణా... గ్లెన్ ఫిలిప్స్ బౌలింగ్‌లోనే భారీ షాట్‌కి ప్రయత్నించి, లివింగ్‌స్టోన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

44 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 56 పరుగులు చేసిన ఓపెనర్ శుబ్2మన్ గిల్, క్రిస్ మోరిస్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి యశస్వి జైస్వాల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి 14 బంతుల్లో 3 ఫోర్లతో 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు... ఆ తర్వాత దినేశ్ కార్తీక్, ఇయాన్ మోర్గాన్ కలిసి వికెట్ పడకుండా బ్యాటింగ్ చేశారు...

దినేశ్ కార్తీక్ 11 బంతుల్లో ఓ సిక్సర్‌తో 14 పరుగులు చేయగా, ఇయాన్ మోర్గాన్ 11 బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్‌తో 13 పరుగులు చేశాడు. 

click me!