IPL 2021: గర్ల్‌ఫ్రెండ్‌కి గ్రౌండ్‌లోనే ప్రపోజ్ చేసిన దీపక్ చాహార్... సీఎస్‌కే బౌలర్ లవ్లీ మూమెంట్...

First Published | Oct 7, 2021, 7:30 PM IST

ఒకడు కష్టపడి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో బాధ్యతగా ఇన్నింగ్స్ నిర్మించి,  టీమ్‌ను విజయం అంచుల దాకా తీసుకొస్తే... మరో ప్లేయర్ ఆఖర్లో సిక్సర్ కొట్టే క్రెడిట్ మొత్తం కొట్టేసినట్టు... ఊర మాస్ ఇన్నింగ్స్ కెఎల్ రాహుల్ తన జట్టును నిర్మిస్తే... సోషల్ మీడియాలో మాత్రం దీపక్ చాహార్ ట్రెండింగ్‌లో నిలిచాడు...

ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్‌ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ ‘మ్యాచ్ విన్నర్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు పేసర్ దీపక్ చాహార్. 

ఫస్టాఫ్‌లో అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చిన దీపక్ చాహార్, సెకండాఫ్‌లో ఆ రేంజ్‌లో కాకపోయినా మంచి ప్రదర్శనే ఇస్తున్నాడు...


పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కెఎల్ రాహుల్ వీరబాదుడు కారణంగా 4 ఓవర్లలో ఒకే వికెట్ తీసి 48 పరుగులు ఇచ్చాడు దీపక్ చాహార్. 

42 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 98 పరుగులు చేసిన కెఎల్ రాహుల్, ఊర మాస్ ఇన్నింగ్స్‌లో పంజాబ్ కింగ్స్‌కి అద్భుత విజయాన్ని అందించినా... ఈ మ్యాచ్ అనంతరం సోషల్ మీడియా అటెన్షన్ మొత్తం లాగేశాడు దీపక్ చాహార్...

దీనికి కారణం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ అనంతరం దీపక్ చాహార్ చేసిన పనే. మ్యాచ్ అనంతరం స్టాండ్స్‌లోకి వెళ్లిన దీపక్ చాహార్, అక్కడ కూర్చొని మ్యాచ్ చూస్తున్న తన గర్ల్‌ఫ్రెండ్‌ జయ భరద్వాజ్‌కి మోకాళ్ల మీద నిలబడి ప్రపోజ్ చేశాడు. 

దీపక్ చాహార్ క్యూట్ అండ్ బ్రేవ్ ప్రపోజల్‌కి సంతోషంతో ఉప్పొంగిపోయిన తన గర్ల్‌ఫ్రెండ్... వెంటనే ‘ఎస్’ చెబుతూ... అతన్ని కౌగిలించుకుంది...

క్రికెట్ స్టేడియంలో ప్రపోజ్ చేసిన మొట్టమొదటి భారత క్రికెటర్‌గా సరికొత్త లిస్టు క్రియేట్ చేయబోతున్నాడు దీపక్ చాహార్. ఫుట్‌బాల్ మ్యాచుల్లో ఇలాంటి మూమెంట్స్ చాలా కామన్ అయినా క్రికెట్‌లో మాత్రం చాలా అరుదు...

గత ఆసీస్ పర్యటనలో ఓ భారత అభిమాని, తన గర్ల్‌ఫ్రెండ్ అయిన ఆస్ట్రేలియా యువతికి ప్రపోజ్ చేసి క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించగా... అతన్ని ఫాలో అయి, ట్రెండింగ్‌లో నిలిచాడు దీపక్ చాహార్..

Latest Videos

click me!