IPL2021: వీడికంటే దినేశ్ కార్తీక్ చాలా బెటర్, అతనికే కెప్టెన్సీ ఇవ్వాలి... కేకేఆర్ కెప్టెన్ మోర్గాన్‌‌పై...

First Published Oct 1, 2021, 5:35 PM IST

ఐపీఎల్ 2020 సీజన్ మధ్యలో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యపరిచాడు దినేశ్ కార్తీక్. కేకేఆర్ టీమ్‌ను విజయవంతంగా నడిపించకపోతే, కెప్టెన్సీ పోతుందని క్రికెట్ విశ్లేషకులు చేసిన హెచ్చరికలను సీరియస్‌గా తీసుకున్న కార్తీక్, పడవ మునగకముందే ఒడ్డు చేరాడు...

దినేశ్ కార్తీక్ నుంచి కేకేఆర్ కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న ఇంగ్లాండ్ వన్డే, టీ20 కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాత్రం ఐపీఎల్‌లో పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాడు... కెప్టెన్‌గా విజయాలు అందుకుంటున్నా, బ్యాట్స్‌మెన్‌గా మాత్రం అట్టర్ ఫ్లాప్ అవుతున్నాడు..

ఐపీఎల్ 2020 సీజన్‌లో 14 మ్యాచులు ఆడి 41.80 సగటుతో 418 పరుగులు చేసిన ఇయాన్ మోర్గాన్, ఈ సీజన్‌లో మాత్రం 11 మ్యాచుల్లో కలిపి 107 పరుగులు మాత్రమే చేశాడు... సగటు 11.88 మాత్రమే...

eoin morgan

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఏకంగా మూడు సార్లు డకౌట్ అయిన ఇయాన్ మోర్గాన్, 2014లో అప్పటి కేకేఆర్ కెప్టెన్ గౌతమ్ గంభీర్ రికార్డును సమం చేసేశాడు...

గౌతమ్ గంభీర్, తన కెరీర్‌లో కేకేఆర్‌ కెప్టెన్‌గా ఆడిన 117 మ్యాచుల్లో 10 సార్లు డకౌట్ అయితే, ఇయాన్ మోర్గాన్ ఇప్పటికే 17 మ్యాచుల్లో 7 సార్లు డకౌట్ కావడం విశేషం...

ఐపీఎల్‌లో అత్యంత చెత్త సగటు కలిగిన కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్ టాప్‌లో నిలిచాడు... 2012లో ముంబై కెప్టెన్ హర్భజన్ సింగ్ 12 సగటుతో, 2009లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ షేన్ వార్న్ 13.5 కంటే దారుణంగా ఉంది మోర్గాన్ పరిస్థితి...

దేశవాళీ క్రికెట్‌లో తమిళనాడు జట్టును అద్భుతంగా నడిపిస్తున్న దినేశ్ కార్తీక్‌ని కాదని ఇయాన్ మోర్గాన్‌కి కెప్టెన్సీ ఇవ్వాలనుకోవడానికి ప్రధాన కారణం 2019 వన్డే వరల్డ్‌కప్...

వన్డే వరల్డ్‌కప్ గెలిచిన కెప్టెన్‌ను జట్టులో పెట్టుకుని, దినేశ్ కార్తీక్‌కి కెప్టెన్సీ ఇవ్వడం ఏంటని చాలామంది ట్రోల్ చేశారు. అయితే ఐపీఎల్‌లో మోర్గాన్ పర్ఫామెన్స్ చూశాక అతని కంటే దినేశ్ కార్తీక్ చాలా బెటర్ అంటున్నారు కేకేఆర్ ఫ్యాన్స్...

click me!