MS Dhoni: 300 యోధుడు..! టీ20 కెప్టెన్ గా అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న చెన్నై కెప్టెన్

Published : Oct 15, 2021, 04:40 PM IST

IPL2021 CSK vs KKR: జెంటిల్మెన్ గేమ్ గా ప్రాచుర్యం పొందిన క్రికెట్ లో ఒక జట్టుకు ఏకబిగిన 14 సీజన్ల పాటు కెప్టెన్ గా వ్యవహరించడమంటే మాటలా..?  కానీ అక్కడ ఉన్నది ధోని. ఈ సమీకరణాలన్నీ తలైవాకు జుజూబి. నేడు కోల్కతా తో జరుగబోయే పోరు అతడికి టీ20 కెప్టెన్ గా 300 మ్యాచ్. 

PREV
110
MS Dhoni: 300 యోధుడు..! టీ20 కెప్టెన్ గా అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్న చెన్నై కెప్టెన్

మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni).. పరిచయం అక్కర్లేని పేరు. భారత క్రికెట్ అభిమానులకు ఈ పేరుతో చాలా ఎమోషన్స్ ఉన్నాయి. ముఖ్యంగా చెన్నై (Chennai Super Kings) ఫ్యాన్స్ కైతే ఆ పేరొక మతం. తమ రాష్ట్రంలో పుట్టకున్నా ధోనిని తలైవా (అన్న) గా పిలుచుకున్నారు. అందుకే ధోని మరే టీమ్ కెప్టెన్ కూడా ఉండలేని విధంగా చెన్నై సూపర్ కింగ్స్ కు ఏకంగా 14 సీజన్ల (రెండు సీజన్లపాటు సీఎస్కే బహిష్కరణకు గురైంది) పాటు కెప్టెన్ గా ఉన్నాడు. 

210

ఇప్పటికే వందలాది రికార్డులు తన పేరిట లిఖించుకున్న ధోని (Dhoni).. నేడు కోల్కతా నైట్ రైడర్స్ (kolkata Knight riders) తో  మ్యాచ్ లో మరో అరుదైన మైలురాయి సాధించబోతున్నాడు. 

310

ఈ మ్యాచ్ తో ధోని టీ20 కెప్టెన్ గా 300వ (Dhoni 300th match) మ్యాచ్ ఆడనున్నాడు. ప్రపంచంలో టీ20 ఫార్మాట్ లో ఇన్ని మ్యాచ్ లకు సారథిగా వ్యవహరించిన ఒకే ఒక క్రికెటర్ ధోని మాత్రమే. 

410

ఐపీఎల్ (IPL) ప్రారంభం నుంచి చెన్నై తరఫున ఆడుతున్న ధోని.. సీఎస్కేకు 213 మ్యాచ్ లలో సారథ్యం వహించాడు. ఇందులో 130 మ్యాచ్ లు గెలువగా 81 మ్యాచ్ లు ఓడిపోయాడు. 

510

ఇక భారత జట్టు తరఫున 71 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లకు ధోని కెప్టెన్ గా వ్యవహరించాడు. ఇందులో భారత్ విజయం సాధించిన మ్యాచ్ లు 41.. ఓడినవి 28 కాగా.. ఒకటి డ్రా అయింది. రెండింటిలో ఫలితం తేలలేదు. 

610
MS Dhoni

చెన్నై (CSK) రెండేండ్ల పాటు నిషేధానికి గురి కావడంతో పూణె రైజింగ్ సూపర్ గేయింట్స్ తరఫున ధోని కెప్టెన్ గా వ్యవహరించాడు. పూణెకు 14 మ్యాచ్ లాడి ఐదింటిలో విజయం సాధించి తొమ్మది ఓడిపోయాడు. 

710

టీ20 ఫార్మాట్ లో ధోని విజయశాతం 59.79 శాతంగా ఉంది.  పొట్టి క్రికెట్ లో 200 కంటే ఎక్కువ మ్యాచ్ లలో కెప్టెన్ గా వ్యవహరించిన వారి జాబితాలో ధోని (299) తర్వాత వెస్టిండీస్ క్రికెటర్ డారెన్ సామి (208) ఉన్నాడు. 

810

అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధికంగా టీ20 మ్యాచ్ లకు సారథ్యం వహించిన వారి జాబితాలో ధోని తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఉన్నాడు. 

910

ఈ రికార్డుతో పాటు ధోని మరో రేర్ రికార్డు  ఈ మ్యాచ్ ద్వారా సాధించబోతున్నాడు. ఐపీఎల్, సీఎల్ టీ20, ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ వంటి మేజర్ టోర్నీలలో ధోని సారథ్యం వహించాడు. 

1010

ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే 2010, 2011, 2018 లో ట్రోఫీ నెగ్గింది. ఈ సీజన్ లో కూడా కప్ నెగ్గితే అది చెన్నైకి నాలుగో ఐపీఎల్ కప్ కానుంది. 

click me!

Recommended Stories