IPL2021 CSK vs PBKS: డుప్లిసిస్ ఒంటరి పోరాటం... పంజాబ్ కింగ్స్ ముందు ఊరించే టార్గెట్..

First Published Oct 7, 2021, 5:24 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో టేబుల్ టాప్‌లో వెళ్లాలని ఆశపడిన చెన్నై సూపర్ కింగ్స్‌ను పంజాబ్ కింగ్స్ బౌలర్లు తెగ ఇబ్బంది పెట్టారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే, నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 134 పరుగులు చేసింది.

అద్భుతమైన ఫామ్‌లో ఉన్న యంగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ 14 బంతుల్లో ఓ ఫోర్‌తో 12 పరుగులు చేసి అర్ష్‌దీప్ సంగ్ బౌలింగ్‌లో అవుట్ కాగా... మొయిన్ ఆలీ ఆరు బంతులాడి డకౌట్ అయ్యాడు...

ఫస్టాఫ్‌లో బ్యాటుతో అదరగొట్టిన మొయిన్ ఆలీ, అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 

ఆ తర్వాత రాబిన్ ఊతప్ప 6 బంతుల్లో 2 పరుగులు, అంబటి రాయుడు 5 బంతుల్లో 4 పరుగులు చేసి క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరారు...

గత మ్యాచ్‌తో పోలిస్తే దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించిన మహేంద్ర సింగ్ ధోనీ 15 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేసి యంగ్ స్పిన్నర్ రవి భిష్ణోయ్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు..

61 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన చెన్నై సూపర్ కింగ్స్‌ను డుప్లిసిస్, జడేజా కలిసి ఆదుకున్నారు. ఈ ఇద్దరూ ఆరో వికెట్‌కి 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

16 ఓవర్లు ముగిసే సమయానికి 86/5 స్కోరు మాత్రమే చేసిన సీఎస్‌కే, 120 పరుగులు మార్కునైనా టచ్ చేయగలదా? అనిపించింది. అయితే డుప్లిసిస్ గేర్ మార్చి, బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు...

55 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 76 పరుగులు చేసిన డుప్లిసిస్, ఐపీఎల్ 2021 సీజన్‌లో 500+ పరుగులు పూర్తిచేసుకున్నాడు. సీఎస్‌కే మరో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కూడా 500+ పరుగులు చేసిన ప్లేయర్‌గా ఉన్నాడు..

ఆఖరి ఓవర్‌లో మొదటి రెండు బంతుల్లో ఓ ఫోర్, సిక్సర్ బాదిన డుప్లిసిస్‌ను మూడో బంతికి షమీ అవుట్ చేయగా... జడేజా 17 బంతుల్లో ఓ ఫోర్‌తో 15 పరుగులు, బ్రావో 4 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు.

click me!