వాళ్లు, వీళ్లు ఎందుకు! పడిక్కల్‌కి కెప్టెన్సీ ఇచ్చేయండి... ఆర్‌సీబీ జట్టుకి ఆశీష్ నెహ్రా సలహా...

First Published Oct 7, 2021, 5:14 PM IST

‘కెప్టెన్‌గా ఇదే నా ఆఖరి ఐపీఎల్ సీజన్’ అంటూ విరాట్ కోహ్లీ ప్రకటించిన తర్వాత ‘ఆర్‌సీబీ నెక్ట్స్ కెప్టెన్ ఎవరు?’ ఐపీఎల్ ఫ్యాన్స్‌ను వెంటాడుతున్న ప్రశ్న ఇదే. ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్ ఏబీ డివిల్లియర్స్ నుంచి సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్ దాకా లిస్టులో చాలామందే ఉన్నారు...

డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగించిన సన్‌రైజర్స్ హైదరాబాద్, అతన్ని వేలానికి వదిలేస్తుందని... వార్నర్ భాయ్‌ను ఆర్‌సీబీ కొనుగోలు చేసి, కెప్టెన్సీ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం నడుస్తోంది...

అలాగే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ కూడా ఆర్‌సీబీకి కెప్టెన్ అయ్యే అవకాశం ఉందని సౌతాఫ్రికా మాజీ బౌలర్ డేల్ స్టెయిన్ కామెంట్ చేశాడు...

వీరితో పాటు రవిచంద్రన్ అశ్విన్, మయాంక్ అగర్వాల్, గ్లెన్ మ్యాక్స్‌వెల్... ఇలా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తర్వాతి కెప్టెన్‌ రేసులో చాలా మందే ఉన్నారు...

అయితే వీరందరికీ ఇచ్చే బదులు, జట్టులో యంగ్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్‌కి కెప్టెన్సీ ఇస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు మాజీ ఆర్‌సీబీ ప్లేయర్ ఆశీష్ నెహ్రా...

‘దేవ్‌దత్ పడిక్కల్‌లో నాకు కెప్టెన్సీ లక్షణాలన్నీ కనిపిస్తున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును సమర్థవంతంగా నడిపించగల నాయకుడు అవుతాడు...

ఆర్‌సీబీ టీమ్ మేనేజ్‌మెంట్, సుదీర్ఘ కాలం పాటు కొనసాగే కెప్టెన్ గురించి వెతుకుతుంటే మాత్రం వాళ్లు, వీళ్లు ఎందుకు, పడిక్కల్‌కి కెప్టెన్సీ ఇవ్వండి... ’ అంటూ కామెంట్ చేశాడు నెహ్రా...

అయితే క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ మాత్రం ఆశీష్ నెహ్రా అభిప్రాయంతో ఏకీభవించడం లేదు. దేవ్‌దత్ పడిక్కల్‌ మంచి బ్యాట్స్‌మెన్‌గా ఎదుగగలడని, అయితే కెప్టెన్సీ లక్షణాలు మాత్రం అతనిలో కనిపించడం లేదని అంటున్నారు...

దేవ్‌దత్ పడిక్కల్, భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ లాంటి వాడు. అతను ఎలాంటి ప్రెషర్ లేకుండా బ్యాటింగ్ చేయగలడు. అంతేకానీ జట్టును నడిపించగల సామర్థ్యాలు సంపాదించడం మాత్రం కష్టమని అంటున్నారు..

click me!