వచ్చే సీజన్‌లో ఆడతా, అయితే సీఎస్‌కేకి ఆడతానో లేదో... మరో ట్విస్ట్ ఇచ్చిన ఎమ్మెస్ ధోనీ...

First Published Oct 7, 2021, 4:05 PM IST

అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి మహేంద్ర సింగ్ ధోనీ, ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి కూడా చాలా పెద్ద చర్చే నడుస్తోంది. గత రెండు సీజన్లుగా మాహీ పర్ఫామెన్స్ బాగోలేకపోవడం కూడా మాహీ రిటైర్మెంట్ గురించి చర్చ జరగడానికి కారణం...

ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ, అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటాడని ప్రచారం జరిగినా, ఆ వార్తలను కొట్టిపారేశాడు మాజీ భారత సారథి...

ఈ ఏడాది ఎమ్మెస్ ధోనీకి ఆఖరి సీజన్ అవుతుందని చాలామంది భావించినా, కొన్నిరోజుల క్రితం ఓ వీడియో ఇంటర్వ్యూలో ఆ ఊహాగానాలకు కూడా తెరదించాడు ‘కెప్టెన్ కూల్’...

తాజాగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌ టాస్ సమయంలో ఈ విషయం గురించే మాహీని ప్రశ్నించాడు యాంకర్ డానీ మోరిసన్... ‘వచ్చే సీజన్‌లో మిమ్మల్ని ఎల్లో జెర్సీలోనే చూడొచ్చా...’ అంటూ అడిగాడు... 

దానికి మహేంద్ర సింగ్ ధోనీ... ‘వచ్చే ఏడాది మీరు నన్ను ఎల్లో జెర్సీలో చూడొచ్చు. అయితే అది సీఎస్‌కేకి ఆడుతూ ఉంటేనే జరుగుతుంది...

ఎందుకంటే వచ్చే ఏడాది రెండు కొత్త టీమ్స్ కూడా వస్తున్నాయి. ఏ ప్లేయర్‌ను ఉంచాలి? ఎవరిని పక్కనబెట్టాలనే విషయంలో సీఎస్‌కే టీమ్ ఏం ఆలోచిస్తుందో ఎవరికి తెలుసు...

ఎంతమంది ఫారిన్ ప్లేయర్లను, ఎంతమంది స్వదేశీ ప్లేయర్లను రిటైన్ చేసుకోవచ్చనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. అది వచ్చాక చెన్నై సూపర్ కింగ్స్ రిటెన్షన్ పాలసీని బట్టి నేను ఉంటానో లేదో తెలుస్తుంది...

పర్సులో ఉన్నదాంట్లో ప్రతీ ప్లేయర్‌కి చెల్లించేలా చూసుకోవాలి. ఇప్పుడే ఏమీ చెప్పలేం. రిటేషన్ పాలసీ విధివిధానాలు వచ్చిన తర్వాత ఓ క్లారిటీ వస్తుంది... 

ఏం జరుగుతుందో చూద్దాం... అందరికీ మంచి జరుగుతుందని ఆశిస్తున్నాం...’ అంటూ చెప్పుకొచ్చాడు... ఈ సమాధానంతో మాహీ ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది...

వాస్తవానికి 2020 సీజన్‌ తర్వాత సీఎస్‌కే నుంచి బయటికి వచ్చి వేలంలో నిలవాలని భావించాడు ఎమ్మెస్ ధోనీ... వేలానికి వెళితే సీఎస్‌కే కెప్టెన్‌గా పొందుతున్న రూ.15 కోట్ల కంటే భారీ మొత్తం పొందే అవకాశం ఉంటుందని భావించాడు...

అయితే ఐపీఎల్ 2020 సీజన్‌లో సీఎస్‌కే పర్ఫామెన్స్ దారుణంగా సాగింది. ప్లేఆఫ్స్ నుంచి తప్పుకున్న మొట్టమొదటి జట్టుగా నిలిచి, పాయింట్ల పట్టికలో ఏడో స్థానంతో ముగించింది...

ఈ కారణాలతో మరో సీజన్ సీఎస్‌కేలో కొనసాగాలని నిర్ణయించుకున్న మహేంద్ర సింగ్ ధోనీ, వచ్చే సీజన్‌లో రెండు కొత్త జట్లు వస్తుండడంతో వేలానికి వెళ్లాలనుకుంటున్నాడని సమాచారం...

ఈ సీజన్‌లో మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ సరిగా లేదు. అయినా కెప్టెన్‌గా మాత్రం సూపర్ సక్సెస్ అవుతున్నాడు. కాబట్టి కొత్త జట్లతో ఆర్‌సీబీ వంటి జట్లు ధోనీ కోసం ఎంత భారీ మొత్తమైనా చెల్లించడానికి రెఢీ అవుతాయని సమాచారం..

click me!