IPL2021 final: ఆ లెక్కన ఈసారి సీన్ రివర్స్ కావాల్సిందే... 2012 కేకేఆర్, సీఎస్‌కే మధ్య జరిగిన ఫైనల్‌లో...

First Published Oct 15, 2021, 3:27 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌ ఫైనల్ మ్యాచ్‌లో సీఎస్‌కే, కేకేఆర్ తలబడనున్నాయి. ఈ రెండు జట్లూ ఫైనల్‌లో టైటిల్ కోసం పోటీపడడం ఇది రెండోసారి. ఇంతకుముందు 2012లో మొట్టమొదటిసారి చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది...

2012లో చెన్నైలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించి, మొట్టమొదటి టైటిల్ కైవసం చేసుకుంది కోల్‌కత్తా నైట్‌రైడర్స్... తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 190 పరుగుల భారీ స్కోరు చేయగా, ఆ టార్గెట్‌ను 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది కేకేఆర్...

2012 సీజన్‌తో పోలిస్తే, 2021 సీజన్‌లో ఇప్పటిదాకా జరిగిన కొన్ని మ్యాచులు రివర్స్‌లో ఫలితాన్ని రాబట్టడం విశేషం. 2012లో గ్రూప్ స్టేజ్‌లో కేకేఆర్ టాప్ 2 పొజిషన్‌లో ఉండగా, సీఎస్‌కే నాలుగో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించింది...

ఈసారి చెన్నై సూపర్ కింగ్స్, టాప్ 2లో ఉండగా కేకేఆర్ టాప్ 4లో నిలిచి ప్లేఆఫ్స్‌కి వచ్చింది... 2012లో క్వాలిఫైయర్ 1లో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్, ఢిల్లీని ఓడించి నేరుగా ఫైనల్‌కి అర్హత సాధించింది.  ఈసారి క్వాలిఫైయర్ 1లో రెండోసారి బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే, ఢిల్లీని ఓడించి ఫైనల్‌కి దూసుకొచ్చింది...

2012లో మొదటి ఎలిమినేటర్ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే గెలిస్తే, ఈసారి ఎలిమినేటర్‌లో రెండోసారి బ్యాటింగ్ చేసిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ విజయం సాధించింది...

2012లో రెండో క్వాలిఫైయర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఫైనల్‌ చేరింది. ఈసారి రెండో క్వాలిఫైయర్‌లో రెండోసారి బ్యాటింగ్ చేసిన కేకేఆర్, ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి ఫైనల్‌కి అర్హత సాధించింది...

అంటే 2012కి తిప్పి వేస్తే 2021 వచ్చినట్టుగా... ఈసారి ఇప్పటిదాకా జరిగిన మ్యాచులన్నీ పర్ఫెక్ట్‌గా రివర్సులో జరిగాయి. అలా చూసుకుంటే సీఎస్‌కే, కేకేఆర్ మధ్య జరిగే ఫైనల్ కూడా రివర్స్‌లో రిజల్ట్ వస్తుందని అంచనా వేస్తున్నారు న్యూమరాలజీ ఎక్స్‌పర్ట్స్...

2012 ఫైనల్ మ్యాచ్‌లో రెండోసారి బ్యాటింగ్ చేసిన కేకేఆర్ టైటిల్ సాధించింది. అలా చూసుకుంటే ఈసారి 2021 ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసే చెన్నై సూపర్ కింగ్స్ చేతుల్లో కేకేఆర్ ఓడిపోతుందని అంచనా వేస్తున్నారు...

చెన్నై సూపర్ కింగ్స్ టైటిల్ గెలిస్తే వారికిది నాలుగో ఐపీఎల్ టైటిల్ అవుతుంది. టాప్‌లో ఉన్న ముంబై ఇండియన్స్‌ (ఐదు టైటిల్స్)కి చేరువవుతుంది సీఎస్‌కే. అదే కేకేఆర్ టైటిల్ గెలిస్తే, సీఎస్‌కే టైటిల్స్ రికార్డును సమం చేస్తుంది...

click me!