సురేష్ రైనాకి కూడా డేవిడ్ వార్నర్‌కి పట్టిన గతేనా... సీఎస్‌కే ఫ్యాన్స్‌లో అనుమానాలు...

First Published Oct 10, 2021, 10:08 PM IST

ఐపీఎల్‌లో ఎలాంటి ప్లేయర్‌ అయినా ఒకే జట్టులో కొనసాగుతాడనే నమ్మకం లేదు. గతంలో క్రిస్‌గేల్, ఐపీఎల్ 2021 సీజన్‌లో డేవిడ్ వార్నర్ విషయంలో ఇదే జరిగింది. ఇప్పుడు సురేష్ రైనా విషయంలోనూ అదే జరుగుతుందా? అని అనుమానిస్తున్నారు సీఎస్‌కే ఫ్యాన్స్...

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరుపున అత్యధిక సెంచరీలు చేసిన ‘యూనివర్సల్ బాస్’ క్రిస్ గేల్‌ను ఆర్‌సీబీ మేనేజ్‌మెంట్ వేలానికి వదిలేస్తుందని ఎవ్వరూ ఊహించలేదు... అయితే అది జరిగింది.

సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌కి ఓ టైటిల్‌తో పాటు ఐదు సీజన్లలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా, మూడు ఆరెంజ్ క్యాప్‌లు గెలిచిన వార్నర్‌ని ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్‌మెంట్ ఈ సీజన్‌లో పక్కనబెట్టింది...

ఇప్పుడు ఈ లిస్టులోనే ‘మిస్టర్ ఐపీఎల్’ సురేష్ రైనా కూడా చేరబోతున్నాడా? అని అనుమానిస్తున్నారు చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్...

ఐపీఎల్ చరిత్రలో సీఎస్‌కే తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు సురేష్ రైనా... ఫ్లే ఆఫ్ మ్యాచుల్లో రైనాకి అద్భుతమైన ట్రాక్ రికార్డు కూడా ఉంది...

ప్లేఆఫ్ మ్యాచుల్లో ఓ సెంచరీ, 8 హాఫ్ సెంచరీలు చేసిన సురేష్ రైనా, మొత్తంగా 714 పరుగులు చేసి ప్లేఆఫ్స్‌లో కీ ప్లేయర్‌గా మారాడు.. 

ఐపీఎల్ కెరీర్‌లో 205 మ్యాచులు ఆడిన రైనా, గుజరాత్ లయన్స్‌కి ఆడిన 29 మ్యాచులు తీసేయగా 176 మ్యాచులు సీఎస్‌కే తరుపున ఆడాడు. ఇందులో 4700+ పైగా పరుగులు చేశాడు...

ఇందులో 33 హఫ్ సెంచరీలు, ఓ సెంచరీ కూడా ఉన్నాయి. అయితే వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2020 సీజన్ ఆరంభానికి ముందు స్వదేశానికి వచ్చేశాడు రైనా. ఇది గత సీజన్‌లో సీఎస్‌కేపై భారీగా ప్రభావం చూపించింది...

ఈ సీజన్‌లో 12 మ్యాచులు ఆడిన సురేష్ రైనా, 17.77 సగటుతో 160 పరుగులు చేశాడు. ఫస్టాఫ్‌లో పర్వాలేదనిపించినా, యూఏఈలో మాత్రం ఘోరంగా ఫెయిల్ అవుతున్నాడు...

యూఏఈలో జరుగుతున్న ఫేజ్ 2లో 5 మ్యాచులు ఆడిన రైనా, 37 పరుగులు మాత్రమే చేయగలగాడు. దీంతో అతన్ని తీసి పక్కనబెట్టేసింది చెన్నై సూపర్ కింగ్స్...

మొదటి క్వాలిఫైయర్‌లో గెలిచి సీఎస్‌కే ఫైనల్ చేరితే, ఆఖరి మ్యాచ్‌లోనూ విన్నింగ్ కాంబినేషన్‌లో మార్పులు చేయడానికి ఎమ్మెస్ ధోనీ ఇష్టపడకపోవచ్చు...

అదే జరిగితే చెన్నై సూపర్ కింగ్స్ తరుపున రైనా ప్రస్తానానికి సరైన ముగింపు దొరకదు. ఎందుకంటే ఐపీఎల్ 2022 సీజన్‌లో మెగా వేలం జరగనుంది... 

ముగ్గురు స్వదేశీ ప్లేయర్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉండడంతో చెన్నై సూపర్ కింగ్స్, సురేష్ రైనాని రిటైన్ చేసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు...

దీపక్ చాహార్, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్ వంటి యంగ్ ప్లేయర్లను ఉంచుకునేందుకే సీఎస్‌కే మొగ్గుచూపొచ్చు. ఇలా జరిగితే ధోనీ మెంటర్‌గా సీఎస్‌కేతోనే ఉంటాడు...

మరి సురేష్ రైనా సంగతేంటి? ఇంతకుముందు ఐపీఎల్ ఆడితే, సీఎస్‌కేకి మాత్రమే ఆడతానని కామెంట్ చేశాడు రైనా... ఆ మాటకే కట్టబడితే మాత్రమే ‘మిస్టర్ ఐపీఎల్‌’, ‘చిన్నతలా’కి ఇదే ఆఖరి సీజన్ కానుంది.. 

click me!