ఐపీఎల్ 2025 ట్రోఫీ ఎవరు గెలుస్తారు? ఐఐటీ బాబా అంచనా ఇదే !

IPL 2025 Winner Prediction by IIT Baba: ఛాంపియన్స్ ట్రోఫీలో అంచనా వేసి ట్రోల్ అయిన మహాకుంభ ఐఐటీ బాబా, ఈసారి ఐపీఎల్ టోర్నీలో ఎవరు గెలుస్తారో చెప్పారు. ఫైనల్ ఎవరితో జరుగుతుంది, ఎవరు గెలుస్తారో అంచనా వేయగా, ఇప్పుడు ఈ ఐఐటీ బాబా అంచనాలు వైరల్ అవుతున్నాయి. 

IPL  Winner Prediction by IIT Baba After Champions Trophy Troll in telugu rma

IPL 2025  Winner Prediction by IIT Baba: ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభ మేళాలో ఐఐటీ బాబాగా పేరుగాంచిన అభయ్ సింగ్ సంచలనం సృష్టించారు. ఐఐటీ వదిలి సన్యాసం తీసుకున్న అభయ్ సింగ్ ఇప్పుడు ఐపీఎల్ 2025 పై అంచనాలు వేశారు. 

IPL  Winner Prediction by IIT Baba After Champions Trophy Troll in telugu rma
IPL 2025 Winner Prediction by IIT Baba After Champions Trophy Troll

ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో ఐఐటీ బాబా అంచనా వేసి అందరి చేత ట్రోల్ అయ్యారు. పాకిస్తాన్ మీద ఇండియా ఓడిపోతుందని చెప్పారు. కానీ ఇండియా గెలిచింది, ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలుచుకుంది. బాబా చెప్పిన పాకిస్తాన్ టీమ్ ఏ టీమ్ మీద గెలవకుండా టోర్నీ నుండి బయటకు వచ్చింది. అయితే, ఇప్పుడు ఐపీఎల్ 2025 ఎవరు గెలుస్తారో అంచనా వేశాడు ఐఐటీ బాబా.


IPL 2025 Winner Prediction by IIT Baba

ఐఐటీ బాబా ప్రకారం ఈసారి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తలపడతాయి. ఆర్‌సీబీ, సీఎస్‌కే 2025 టోర్నీలో బాగా ఆడి ఫైనల్స్‌కు వస్తాయి. బాబా అంచనా ఇంతటితో ఆగలేదు.

IPL 2025 Winner Prediction by IIT Baba After Champions Trophy Troll

ఫైనల్ మ్యాచ్‌లో గట్టి పోటీ ఉంటుంది. ఆఖరికి ఆర్‌సీబీ ట్రోఫీ గెలుస్తుంది అని అంచనా వేశారు. ఐఐటీ బాబా ఈ అంచనా వేయగానే ఆర్‌సీబీ అభిమానుల్లో సంతోషం కంటే భయం ఎక్కువైంది. ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ఇండియా మీద గెలుస్తుందని చెప్పి ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. ఇప్పుడు ఆర్‌సీబీ గెలుస్తుందని అభిమానులను భయపెట్టారు. ఎందుకంటే ఛాంపియన్స్ ట్రోఫీలాగా కథ అడ్డం తిరుగుతుందోమోనని భయపడుతున్నారు.

IPL 2025 Winner Prediction by IIT Baba After Champions Trophy Troll

ఆర్‌సీబీ ఈసారి మంచి ఆరంభం పొందింది. గత సీజన్ల కంటే టీమ్ బాగా ఆడుతుందనే సంకేతాలు పంపింది. ఆడిన రెండు మ్యాచ్ లలో విజయం సాధించింది. అయితే, చెన్నై మాత్రం రెండు మ్యాచ్ లలో 1 ఓడిపోయింది. అందుకే ఐటీటీ బాబా అంచనా నిజమవుతుందని అంటున్నారు. ఆర్‌సీబీ ఇన్నేళ్లుగా ట్రోఫీ కోసం ఎదురుచూసింది. ఇరు జట్లు ఫైనల్ కు చేరుకోవాలనీ,  ఫైనల్ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ను ఓడించి ట్రోఫీ గెలవాలని ఆర్సీబీ అభిమానులు కోరుకుంటున్నారు.

Latest Videos

vuukle one pixel image
click me!