CSK vs RCB: 16 ఏళ్ల తర్వాత చెన్నై కంచుకోటలో ఆర్సీబీ జెండా !
IPL 2025 CSK vs RCB: హాజిల్‌వుడ్, రజత్ పాటిదార్ అద్భుతమైన ఆటతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్‌ను 50 పరుగుల తేడాతో ఓడించింది.
IPL 2025 CSK vs RCB: హాజిల్‌వుడ్, రజత్ పాటిదార్ అద్భుతమైన ఆటతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెన్నై సూపర్ కింగ్స్‌ను 50 పరుగుల తేడాతో ఓడించింది.
IPL 2025 CSK vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో విరాట్ కోహ్లీ టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలతో దూసుకుపోతోంది. తమ తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ను ఓడించిన తర్వాత ఇప్పుడు ఆర్సీబీ 5 సార్లు ఐపీఎల్ విజేత అయిన చెన్నై సూపర్ కింగ్స్ ను ఓడించింది. దాదాపు 16 ఏళ్ల తర్వాత చెన్నై కంచుకోటలో ఆర్సీబీ తన జెండాను పాతింది. ఈ విజయంతో ఐపీఎల్ 2025 పాయింట్ల పట్టికలో ఆర్సీబీ టాప్ లోకి వచ్చింది.
ఐపీఎల్ 2025 8వ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)-ఎంఎస్ ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లు చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగంలో అదరగొట్టింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆర్సీబీ సాధించలేని విజయాన్ని రజత్ పాటిదార్ సాధించాడు. పాటిదార్ నేతృత్వంలోని ఆర్సీబీ 6155 రోజుల తర్వాత చెపాక్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ను 50 పరుగుల తేడాతో ఓడించింది.
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయిన తర్వాత మొదట బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీకి మంచి ఆరంభం లభించింది. ఆర్సీబీ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ వచ్చిన వెంటనే ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. చెన్నై బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అతను 32 పరుగులే చేసినా ఉన్నంత సేపు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే, స్టార్ విరాట్ కోహ్లీ కూడా 31 పరుగులు ఇన్నింగ్స్ ఆడాడు.
మూడో స్థానంలో వచ్చిన దేవదత్ పడిక్కల్ 14 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లతో 27 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. నాలుగో స్థానంలో వచ్చిన రజత్ పాటిదార్ జట్టుకు కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. 32 బంతుల్లో 51 పరుగులు తన ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. చివరలో టిమ్ డేవిడ్ హ్యాట్రిక్ సిక్సర్లతో ఆర్సీబీ 196 పరుగులు చేసింది.
భారీ స్కోర్ తో బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కు మంచి ఆరంభం లభించలేదు. ఆ తర్వాత కూడా ఏ బ్యాటర్ నుంచి కూడా సూపర్ ఇన్నింగ్స్ లు రాలేదు. వరుస వికెట్లు కోల్పోవడంతో పాటు పరుగులు చేయడం తగ్గిపోవడంతో కావాల్సిన రన్ రేటు పెరిగిపోయింది. దీంతో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 146 పరుగులు మాత్రమే చేసింది.
చెన్నై ఇన్నింగ్స్ లో రచిన్ రవీంద్ర 41 పరుగులు చేశాడు. చివరలో ధోని 30 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆర్సీబీ బౌలర్లలో హాజిల్ వుడ్ 3 వికెట్లు, యష్ దయాల్ 2, లివింగ్ స్టోన్ 2, భువనేశ్వర్ కుమార్ 1 వికెట్ తీసుకున్నారు.