IPL MS Dhoni: నేను వికెట్ కీప‌ర్ కాక‌పోయి వుంటే.. ధోని చెప్పిన ర‌హ‌స్యం !

Published : Mar 28, 2025, 11:14 PM IST

IPL MS Dhoni: 43 ఏళ్ల వయస్సులోనూ ఎంఎస్ ధోని మెరుపు కీపింగ్ తో అద‌ర‌గొడుతున్నాడు. అయితే తాను వికెట్ కీప‌ర్ కాక‌పోయి ఉంటే ఎలా వుండేద‌నే విష‌యాలు ప్ర‌స్తావిస్తూ ధోని చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.   

PREV
15
IPL MS Dhoni:  నేను వికెట్ కీప‌ర్ కాక‌పోయి వుంటే.. ధోని చెప్పిన ర‌హ‌స్యం !

IPL MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని 43 సంవత్సరాల వయస్సులో కూడా చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్ ఆడుతూ వికెట్ కీపర్‌గా అద్భుతంగా రాణిస్తున్నాడు. త‌న అద్భుత‌మైన ఆట ప‌దునెంటో చూపిస్తున్నాడు. 

ఈ క్ర‌మంలోనే తాజాగా భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని త‌న‌ అభిమానులకు పెద్ద ర‌హ‌స్యం చెప్పాడు. తన వికెట్ కీపర్ పాత్రపై బహిరంగంగా మాట్లాడాడు. 43 సంవత్సరాల వయస్సులో కూడా చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్ ఆడుతూ వికెట్ కీపర్‌గా అద్భుతంగా రాణిస్తున్న ధోని ప్ర‌స్తుతం కెప్టెన్ కాకుండా టీమ్ లో స‌భ్యునిగా కొన‌సాగుతున్నాడు.  ధోని కెప్టెన్సీలో, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐదుసార్లు ఐపీఎల్ టైటిల్‌ను గెలుచుకుంది. 10 సార్లు ఫైనల్స్‌కు చేరుకోవ‌డం విశేషం.

25
IPL MS Dhoni: If I hadn't been a wicketkeeper.. this is the secret told by MS Dhoni!

స్టార్ స్పోర్ట్స్ పోస్ట్ చేసిన వీడియోలో మహేంద్ర సింగ్ ధోని మాట్లాడుతూ.. 'నేను వికెట్ కీపింగ్ చేయకపోతే, మైదానంలో నేను పనికిరానివాడిని అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే అక్కడే నేను ఆటను బాగా రీడ్ చేస్తాను. ఇది ఒక సవాలు లాంటిదని అన్నాడు. అలాగే, గత కొన్ని సంవత్సరాలుగా జ‌ట్టులో కొన‌సాగడంపై 2 లేదా 5 సంవత్సరాలు అని నాకు తెలియదు, నా ఫ్రాంచైజీ ఇలాగే ఉంది, మీరు ఆడాలనుకున్నంత కాలం మీరు ఆడతారు. వాళ్ళు కూడా బాధపడకు నువ్వు ఆడుకో అని అంటారు. నేను క్రికెట్‌ను ఆస్వాదించాలనుకుంటున్నాను.. కాబ‌ట్టి ప్ర‌యాణం కొన‌సాగుతోంది' అని ధోని అన్నాడు. 

35
IPL MS Dhoni: If I hadn't been a wicketkeeper.. this is the secret told by MS Dhoni!

గత సీజన్‌లో ధోని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తమ ప్ర‌యాణాన్ని ఐపీఎల్ 2025 టోర్నీలో చెపాక్‌లో ముంబై ఇండియన్స్‌పై విజయంతో ప్రారంభించింది. కెప్టెన్ కాకపోయినా, మహేంద్ర సింగ్ ధోని ఫీల్డ్ ప్లేస్‌మెంట్‌లలో చురుగ్గా పాల్గొంటూనే ఉంటాడు. మ్యాచ్‌ల సమయంలో రుతురాజ్ గైక్వాడ్‌కి మార్గనిర్దేశం చేయ‌డం చాలా మ్యాచ్ ల‌లో క‌నిపించింది. 

45
Image Credit: Getty Images

జియో హాట్‌స్టార్ షోలో ధోని మాట్లాడుతూ.. 'గత సంవత్సరం నేను వెంటనే అతనికి (రుతురాజ్ గైక్వాడ్) చెప్పాను, '90% నువ్వు కెప్టెన్ అవుతావు, కాబట్టి మానసికంగా నిన్ను నువ్వు సిద్ధం చేసుకోవడం మొదలుపెట్టు' అని అలాగే, నేను నీకు సలహా ఇస్తే, దానిని నువ్వు పాటించాలని కాదు. నేను వీలైనంత వరకు క‌ప్టెన్సీకి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తాను అని టోర్నమెంట్ ప్రారంభమయ్యే ముందు నేను రుతురాజ్ కు చెప్పాన‌ని' ధోని పేర్కొన్నాడు.

55
Image Credit: Getty Images

అలాగే, 'నేను మైదానంలో నిర్ణయాలు తీసుకుంటున్నానని చాలా మంది భావించారు, కానీ నిజం ఏమిటంటే అతను (రుతురాజ్ గైక్వాడ్) 99 శాతం నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అతిపెద్ద నిర్ణయాలు, బౌలింగ్ మార్పులు, ఫీల్డ్ ప్లేస్‌మెంట్లు - అన్నీ అతనివే. నేను అతనికి సహాయం చేస్తున్నాను. ఆటగాళ్లను హ్యాండిల్ చేయడంలో అతను అద్భుతంగా పనిచేశాడని' ధోని అన్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories