Shubman Gill: గిల్ ఔటా? నాటౌటా?.. ఏం జ‌రిగిందంటే?

Published : May 02, 2025, 09:58 PM IST

Gujarat Titans captain Shubman Gill: ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో శుభ్ మన్ గిల్ 76 పరుగుల సూపర్ నాక్ ఆడాడు. కానీ వివాదాస్పద రన్ అవుట్‌తో వెనుదిరిగాడు. గిల్ సూపర్ షో మధ్య అతని రనౌట్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. గిల్ అవుట్ అయ్యాడా?  కాలేదా? అస‌లు ఏం జ‌రిగింది?  

PREV
15
Shubman Gill: గిల్ ఔటా? నాటౌటా?.. ఏం జ‌రిగిందంటే?

Gujarat Titans captain Shubman Gill: ఐపీఎల్ 2025లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ సూప‌ర్ బ్యాటింగ్ కొన‌సాగుతోంది. వ‌రుస‌గా హాఫ్ సెంచ‌రీల మోత మోగిస్తున్నాడు. శుక్రవారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో మ‌రోసారి అద్బుత‌మైన నాక్ ఆడాడు. 

25

అయితే, మంచి జోష్ లో ఉన్న స‌మ‌యంలో గిల్ రన్ అవుట్‌గా ఔట్ అయ్యారు. 13వ ఓవర్‌లో జోస్ బట్లర్ అన్సారీ బౌలింగ్‌లో షార్ట్ ఫైన్ లెగ్ వైపు బౌండరీకి కొట్టిన తర్వాత వేగంగా సింగిల్ కోసం పిలిచారు. హర్షల్ పటేల్ బంతిని స్ట్రైకర్ ఎండ్‌కు ఫ్లాట్ థ్రో వేసాడు. వికెట్‌కీపర్ హైన్రిచ్ క్లాసెన్, స్టంప్స్ ముందు ఉండి, తన గ్లోవ్స్‌తో బంతిని స్టంప్స్‌పై తగిలించడానికి ప్రయత్నించారు. ఈ ఔట్ చాలా నెమ్మదిగా కనిపించడంతో, అంపైర్ రివ్యూ కోసం వెళ్లారు. 

35

థ‌ర్డ్ అంపైర్ క్లాసెన్ గ్లోవ్స్‌తో స్టంప్స్‌ను తాకిన తర్వాత బంతి స్టంప్స్‌ను తాకిందని నిర్ధారించారు. ఈ నిర్ణయంతో గిల్ ఆశ్చర్యానికి గురయ్యారు, కానీ తిరిగి డగౌట్‌కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తర్వాత, టీవీ అంపైర్ మైఖేల్ గౌత్‌తో గిల్ వాగ్వాదానికి దిగాడు. సోష‌ల్ మీడియాలో గిల్ అవుట్ పై ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బాల్ త‌గ‌ల‌లేద‌ని కేవ‌లం గ్లోవ్స్ మాత్ర‌మే తాకాయ‌ని ఫైర్ అవుతున్నారు. 

45

ఎస్ఆర్హెచ్ పై గిల్ సూప‌ర్ నాక్ 

రన్ అవుట్ అయినప్పటికీ, గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. 38 బంతుల్లో 76 పరుగులు చేసి 25వ ఐపీఎల్ హాఫ్ సెంచరీ సాధించారు. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ 87 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని సాయి సుద‌ర్శ‌న్ తో, ఆ త‌ర్వాత 62 పరుగుల భాగస్వామ్యాన్ని జోస్ బట్లర్‌తో నెల‌కోల్పాడు. గిల్, సాయి సూప‌ర్ నాక్ ల‌తో పవర్‌ప్లేలో 82 ప‌రుగులు చేసింది గుజ‌రాత్. గుజరాత్ టైటాన్స్‌కు అత్యధిక స్కోరు ఇది. 

55

గిల్ 76 పరుగులు చేసిన ఈ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి.  200 స్ట్రైక్ రేట్ తో గిల్ బ్యాటింగ్ సాగింది. గిల్ మొత్తంగా 113 ఐపీఎల్ మ్యాచ్‌లలో (110 ఇన్నింగ్స్) 3,681 పరుగులు సాధించాడు. 25 హాఫ్ సెంచరీలు, 4 సెంచరీలు బాదాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లలో గిల్ 15 మ్యాచ్‌లలో 535 పరుగులు సాధించారు. ఇక్క‌డ గిల్ స‌గ‌లు 48.63. ఇందులో 4 హాఫ్ సెంచరీలు, 1 సెంచరీ సాధించారు.

Read more Photos on
click me!

Recommended Stories