అతను వేలానికి వస్తే, రికార్డులు బద్ధలు కావాల్సిందే... కేకేఆర్ యంగ్ ఆల్‌రౌండర్‌పై ఇర్ఫాన్ పఠాన్ కామెంట్...

First Published Nov 30, 2021, 3:52 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్‌లో వరుస పరాజయాలతో కృంగిపోయిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కథను మార్చి, సెకండాఫ్‌లో విజయాలవైపు నడిపించిన రైడర్ వెంకటేశ్ అయ్యర్. లీగ్ మధ్యలో ఆరంగ్రేటం చేసినా, అదిరిపోయే పర్ఫామెన్స్‌ ఇచ్చిన అయ్యర్ వేలంలోకి వస్తే రికార్డు బ్రేక్ కావాల్సిందేనని అంటున్నాడు మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్...

ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు జరిగి రిటెన్షన్ గురించి అన్ని ఫ్రాంఛైజీలు ఏ ప్లేయర్‌ని రిటైన్ చేసుకోవాలి? ఎవరిని వేలానికి విడుదల చేయాలనే లెక్కలు వేస్తున్నాయి...

‘కేకేఆర్‌లో ఇద్దరు స్టార్ ఆల్‌రౌండర్లు ఉన్నారు. కచ్ఛితంగా సునీల్ నరైన్, ఆండ్రే రస్సెల్‌లను వేలానికి విడుదల చేయడానికి కేకేఆర్ ఇష్టపడకపోవచ్చు. ఆ ఇద్దరి పర్ఫామెన్స్‌పై ఇంకా భారీ అంచనాలే ఉన్నాయి...

సునీల్ నరైన్, ఆండ్రే రస్సెల్ పూర్తి ఫిట్‌గా లేరు. వాళ్లు మహా అయితే మరో రెండేళ్లు మాత్రమే ఆడతారు. అయితే వాళ్లు ఒకే ఒక్క ఓవర్‌లో అటు బ్యాటుతో, ఇటు బాల్‌తోనూ మ్యాచ్‌ను టర్న్ చేయగలరు...

ఒకవేళ కేకేఆర్, పేసర్ లూకీ ఫర్గూసన్‌ గురించి ఆలోచిస్తే.. అతను కొత్త బంతితో, పాత బంతితో అద్భుతంగా యార్కర్లు వేస్తూ అదరగొడుతున్నాడు. ప్యాట్ కమ్మిన్స్ కంటే లూకీ ఫర్గూసన్‌ని అట్టిపెట్టుకుంటే బెటర్...

ఇక మూడో రిటెన్షన్ విషయానికి వస్తే యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను అట్టిపెట్టుకుంటే బెటర్. శుబ్‌మన్ గిల్‌లో నాయకత్వ లక్షణాలు కూడా ఉన్నాయి. బ్యాటుతో రాణిస్తూ, జట్టును నడిపిస్తున్నాడు...

నాలుగో రిటెన్షన్ గురించి ఆలోచించిన్ప్పుడు వరుణ్ చక్రవర్తిని రిటైన్ చేసుకోవాలా? లేక నితీశ్ రాణాని అట్టిపెట్టుకోవాలా? అని కేకేఆర్ ఆలోచించవచ్చు. అయితే ఈ ఇద్దరి కంటే వెంకటేశ్ అయ్యర్‌ని రిటైన్ చేసుకోవడం చాలా బెటర్..

ఎందుకంటే వెంకటేశ్ అయ్యర్‌ లాంటి పేస్ ఆల్‌రౌండర్ వేలానికి వస్తే, తిరిగి దక్కించుకోవడం చాలా కష్టమైపోతుంది. అయ్యర్ కోసం ఎంత చెల్లించడానికైనా మిగిలిన ఫ్రాంఛైజీలు సిద్ధంగా ఉంటాయి...’ అంటూ చెప్పుకొచ్చాడు ఇర్ఫాన్ పఠాన్...

కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌‌తో పాటు మాజీ కెప్టెన్ దినేశ్ కార్తీక్‌లను కేకేఆర్ రిటైన్ చేసుకోవడం లేదని సమాచారం. 37 ఏళ్ల దినేశ్ కార్తీక్, 35 ఏళ్ల ఇయాన్ మోర్గాన్ వేలంలో పాల్గొనబోతున్నారు...

అలాగే శుబ్‌మన్ గిల్ స్ట్రైయిక్ రేటు కూడా తక్కువగా ఉండడంతో మూడో రిటెన్షన్‌గా వరుణ్ చక్రవర్తిని, నాలుగో రిటెన్షన్‌గా వెంకటేశ్ అయ్యర్‌ని అట్టిపెట్టుకోవాలని కేకేఆర్ భావిస్తోందని సమాచారం...

అలాగే రాహుల్ త్రిపాఠి, ప్రసిద్ధ్ కృష్ణ, శివమ్ మావి, కుల్దీప్ యాదవ్ వంటి ప్లేయర్లు అందరూ ఐపీఎల్ 2022 సీజన్ వేలంలో పాల్గొనబోతున్నారు...

click me!