శుబ్‌మన్ గిల్ వద్దు, మోర్గాన్‌ని మోయలేము... ఐపీఎల్ 2022లో కేకేఆర్‌ రిటైన్ చేసుకునే ప్లేయర్లు వీరే...

First Published Nov 30, 2021, 1:29 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ టీమ్‌ను ఫైనల్ చేర్చిన కెప్టెన్ ఇయాన్ మోర్గాన్. సారథిగా సూపర్ సక్సెస్ అయినా, బ్యాట్స్‌మెన్‌గా అట్టర్‌ఫ్లాప్ అయ్యాడు మోర్గాన్. సీజన్‌లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా నమోదుచేయలేకపోయాడు...

2019 వన్డే వరల్డ్ కప్ గెలిచిన కెప్టెన్‌ని అట్టిపెట్టుకుని, దినేశ్ కార్తీక్‌ని కెప్టెన్‌గా కొనసాగిస్తున్నారనే ట్రోలింగ్ రావడంతో డీకే స్వచ్ఛందంగా 2020 సీజన్ మధ్యలో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు...

అయితే సీజన్ మధ్యలో కెప్టెన్సీ తీసుకున్న ఇయాన్ మోర్గాన్, కేకేఆర్‌ను ప్లేఆఫ్స్‌కి చేర్చలేకపోయాడు. ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్‌లో మాత్రం కేకేఆర్ అద్భుతమే చేసింది...

ఇండియాలో జరిగిన ఫస్టాఫ్‌లో స్లో బ్యాటింగ్‌తో 7 మ్యాచుల్లో రెండే విజయాలు అందుకున్న కేకేఆర్, వెంకటేశ్ అయ్యర్, లూకీ ఫర్గూసన్‌ల పుణ్యాన సెకండాఫ్‌లో అద్భుత విజయాలతో ఏకంగా ఫైనల్‌కి దూసుకెళ్లింది...

కెప్టెన్‌గా సక్సెస్ అయినా బ్యాట్స్‌మెన్‌గా టీమ్‌కి భారంగా మారిన ఇయాన్ మోర్గాన్‌ని ఐపీఎల్ 2022 సీజన్‌ కోసం రిటైన్ చేసుకోవడం లేదని ప్రకటించింది కోల్‌కత్తా నైట్‌రైడర్స్...

35 ఏళ్ల ఇయాన్ మోర్గాన్, ఇంకా ఎన్నేళ్లు క్రికెట్ ఆడతాడో చెప్పడం కష్టం. అలాగే కేకేఆర్ విజయాల్లో ఇయాన్ మోర్గాన్ కంటే, వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్, హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ కీలక పాత్ర పోషించారనేది అందరికీ తెలిసిన విషయమే...

ఇయాన్ మోర్గాన్‌తో పాటు యంగ్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌ను కూడా వేలానికి విడుదల చేయనుంది కేకేఆర్. 2021 సీజన్‌ ఫస్టాఫ్‌లో స్లో బ్యాటింగ్‌తో చికాకు తెప్పించినా, సెకండాఫ్‌లో అయ్యర్ ఎంట్రీతో గేర్ మార్చి బ్యాటింగ్ చేశాడు శుబ్‌మన్ గిల్...

ఐపీఎల్ 2020 సీజన్‌లో 440 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, 2021 సీజన్‌లో 17 మ్యాచుల్లో 478 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు కూడా ఉన్నాయి....

అయితే శుబ్‌మన్ గిల్‌ని అట్టిపెట్టుకోవడానికి కేకేఆర్ ఆసక్తి చూపించడం లేదు. ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు నలుగురు ప్లేయర్లను రిటైన్ చేసుకోవాలని కేకేఆర్ భావిస్తోంది...

స్టార్ ఆల్‌రౌండర్లు సునీల్ నరైన్, ఆండ్రే రస్సెల్‌తో పాటు యంగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, యంగ్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ను రిటైన్ చేసుకోవాలని భావిస్తోంది కేకేఆర్...

మొదటి రిటెన్షన్‌గా సునీల్ నరైన్‌కి ఏటా రూ.16 కోట్లు, విండీస్ ఆల్‌రౌండర్ ఆండ్రే రస్సెల్‌కి రూ.12 కోట్లు, వరుణ్ చక్రవర్తికి రూ.8 కోట్లు, నాలుగో రిటెన్షన్‌గా వెంకటేశ్ అయ్యర్‌కి రూ.6 కోట్లు చెల్లించనుంది కేకేఆర్...

యంగ్ బ్యాట్స్‌‌మెన్ రాహుల్ త్రిపాఠి, నితీశ్ రాణాతో పాటు కేకేఆర్ యంగ్ బౌలర్లు శివమ్ మావి, ప్రసిద్ధ్ కృష్ణ, సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ మెగా వేలంలో పాల్గొనబోతున్నారు...

click me!