సురేష్ రైనా: ‘మిస్టర్’ ఐపీఎల్‌గా గుర్తింపు తెచ్చుకున్న సురేష్ రైనా, చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ధోనీతో పాటు రైనాని కూడా రిటైన్ చేసుకుంటూ వచ్చింది సీఎస్‌కే. అయితే గత సీజన్‌లో పర్ఫామెన్స్ కారణంగా రైనాని రిటైన్ చేసుకోవడం లేదు సీఎస్‌కే...
శ్రేయాస్ అయ్యర్: ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌ని మొట్టమొదటి సారి ఫైనల్ చేర్చిన యంగెస్ట్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్. అన్నీ సజావుగా జరిగి ఉంటే, అయ్యర్... ఢిల్లీకి ఫస్ట్ రిటెన్షన్‌గా ఉండేవాడు. అయితే ఈ ఏడాది ఐపీఎల్ ఫస్టాఫ్‌కి ముందు జరిగిన గాయం సీన్ మొత్తం మార్చేసింది.
రిషబ్ పంత్‌కి కెప్టెన్సీ ఇవ్వడంతో బాగా హార్ట్ అయిన శ్రేయాస్ అయ్యర్, ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్త ఫ్రాంఛైజీకి మారాలని ఫిక్స్ అయ్యాడట...
శిఖర్ ధావన్: గత రెండు సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు శిఖర్ ధావన్. గత సీజన్‌లో 600+ పరుగులు చేసిన ధావన్, ఐపీఎల్ 2021లో 587 పరుగులు చేశాడు...
రవిచంద్రన్ అశ్విన్: ఐపీఎల్‌లో రవిచంద్రన్ అశ్విన్ ఆల్‌రౌండర్‌గా మారాడు. 2019 సీజన్‌లో పంజాబ్ కింగ్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించిన అశ్విన్, గత రెండేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌కి మ్యాచ్ విన్నర్‌గా ఉన్నాడు. అశ్విన్, ఢిల్లీ తనని రిటైన్ చేసుకోవడం లేదని స్వయంగా ప్రకటించాడు...
హార్ధిక్ పాండ్యా: ముంబై ఇండియన్స్‌లో స్టార్ ఆల్‌రౌండర్‌గా ఎదిగి, భారత జట్టులోకి వచ్చాడు హార్ధిక్ పాండ్యా. అయితే గత రెండు సీజన్లలో బౌలింగ్ చేయలేకపోయిన హార్ధిక్ పాండ్యా, బ్యాటుతోనూ పెద్దగా రాణించలేకపోయాడు..
హర్షల్ పటేల్: ఐపీఎల్ 2021 సీజన్ హర్షల్ పటేల్ రాతను పూర్తిగా మార్చేసింది. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా పర్పుల్ క్యాప్ గెలిచిన హర్షల్ పటేల్, ఆర్‌సీబీలో ఉన్న స్టార్ల కారణంగా రిటైన్ కాలేకపోతున్నాడు. అయితే వేలంలో హర్షల్ పటేల్‌కి భారీ ధర దక్కే అవకాశం ఉంది.
సూర్యకుమార్ యాదవ్: ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శనకు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సూర్యకుమార్ యాదవ్. 2021 సీజన్‌కి వరుసగా మూడు సీజన్లలో 400+ పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్‌ను ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకుంటుందా? లేదా? అనేది అనుమానంగా మారింది.
దీపక్ చాహార్: చెన్నై సూపర్ కింగ్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన బౌలర్ దీపక్ చాహార్. ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఒకటి రెండు వికెట్లు తీసే దీపక్ చాహార్‌ను రిటైన్ చేసుకోవడం లేదు చెన్నై సూపర్ కింగ్స్...
మయాంక్ అగర్వాల్: పంజాబ్ కింగ్స్ జట్టులో కెఎల్ రాహుల్ తర్వాత అత్యధిక పరుగులు చేసే బ్యాట్స్‌మెన్ మయాంక్ అగర్వాల్. అయితే పంజాబ్ కింగ్స్ ప్లేయర్లందరినీ వేలానికి విడుదల చేయాలని నిర్ణయించుకుంది...
మనీశ్ పాండే: సన్‌రైజర్స్ హైదరాబాద్ మనీశ్ పాండేని నమ్మినంతగా ఏ ప్లేయర్‌నీ నమ్మలేదేమో. గత మెగా వేలంలో మనీశ్ పాండేని రిటైన్ చేసుకున్న సన్‌రైజర్స్, మూడేళ్ల పాటు ఏటా రూ.11 కోట్లు చెల్లించింది. అయితే ఈసారి మనీశ్ అన్నను రిటైన్ చేసుకోవడం లేదు ఆరెంజ్ ఆర్మీ...