ఐపీఎల్ రిటెన్షన్‌కి డేట్ ఫిక్స్... ఆ కార్యాన్ని కూడా లైవ్ టెలికాస్ట్ చేయనున్న బీసీసీఐ...

Published : Nov 25, 2021, 04:54 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు మెగా వేలం నిర్వహించనుంది బీసీసీఐ. ఇప్పటికే అహ్మదాబాద్, లక్నో నగరాల పేర్లతో రెండు కొత్త ఫ్రాంఛైజీలు, ఐపీఎల్ 2022 సీజన్‌కి బిడ్ దక్కించుకున్నాయి. మెగా వేలానికి ముందు రిటెన్షన్ పాలసీ చాలా కీలకం కానుంది...

PREV
110
ఐపీఎల్ రిటెన్షన్‌కి డేట్ ఫిక్స్... ఆ కార్యాన్ని కూడా లైవ్ టెలికాస్ట్ చేయనున్న బీసీసీఐ...

ఐపీఎల్ రిటెన్షన్ పాలసీ ప్రకారం పాత ఫ్రాంఛైజీలకు గరిష్టంగా నలుగురు ప్లేయర్లను అట్టి పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. ఏయే జట్లు, ఏయే ప్లేయర్లను అట్టిపెట్టుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది...

210

ఫ్యాన్స్‌లో రిటెన్షన్‌కి ఉన్న ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు నవంబర్ 30న జరిగే ఐపీఎల్ రిటెన్షన్ ప్రోగ్రామ్‌ని కూడా లైవ్ టెలికాస్ట్ చేయబోతున్నారు. స్టార్ నెట్‌వర్క్‌తో పాటు హాట్ స్టార్ యాప్‌లోనూ ఈ రిటెన్షన్ ప్రోగ్రామ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది...

310

రిటెన్షన్ చేసుకున్న ప్లేయర్లకు గరిష్టంగా రూ.15 కోట్లు, కనీసం రూ.4 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఇంతకుముందు రూ.20 లక్షలు తీసుకున్న హర్షల్ పటేల్‌ను ఈసారి ఆర్‌సీబీ రిటైన్ చేసుకోవాలనుకుంటే, రూ.4 కోట్లు చెల్లించడానికి సిద్ధంగా ఉండాల్సిందే...

410

సీఎస్‌కే సారథి ఎమ్మెస్ ధోనీ, ఆర్‌సీబీ మాజీ సారథి విరాట్ కోహ్లీలను రిటైన్ చేసుకోవడం ఖాయం. అయతే మెగా వేలానికి ముందు ఫ్రాంఛైజీలు ఏమైనా చేయొచ్చు, ఎలాగైనా ఆలోచించొచ్చు...

510

అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కెఎల్ రాహుల్ వంటి ప్లేయర్లు కూడా ఐపీఎల్‌ వేలంలో పాల్గొనబోతున్నారంటూ సోషల్ మీడియాలో బీభత్సమైన ప్రచారం జరుగుతోంది...

610

ఇప్పటిదాకా అధికారిక ప్రకటన రాకపోయినా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు, ఎమ్మెస్ ధోనీ, రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, ఫాఫ్ డుప్లిసిస్‌లను రిటైన్ చేసుకునేందుకు ఎక్కవ అవకాశం ఉంది. డుప్లిసిస్ స్థానంలో సామ్ కుర్రాన్‌ను అట్టిపెట్టుకున్నా, ఆశ్చర్యపోనక్కర్లేదు...

710

ముంబై ఇండియన్స్ జట్టు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రిత్ బుమ్రాలతో పాటు కిరన్ పోలార్డ్‌ను అట్టి పెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ ట్రెంట్ బౌల్ట్ కావాలనుకుంటే యాదవ్‌ను వదులుకోవాల్సిందే...

810

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, దేవ్‌దత్ పడిక్కల్, యజ్వేంద్ర చాహాల్‌లను అట్టి పెట్టుకునే అవకాశం ఉంది...

910

ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు రిషబ్ పంత్, పృథ్వీషా, నోకియా, రబాడాలను అట్టి పెట్టుకోవచ్చు. శిఖర్ ధావన్, ఆవేశ్ ఖాన్ విషయంలో కూడా ఢిల్లీ ఆలోచనలు చేయొచ్చు... 

1010

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కేన్ విలియంసన్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్‌లను వదులుకునే సాహసం చేయకపోవచ్చు. డేవిడ్ వార్నర్, మనీశ్ పాండేలపై అనుమానాలు కొనసాగుతున్నాయి...

Read more Photos on
click me!

Recommended Stories