గంగూలీ కంటే దారుణంగా అజింకా రహానే ఫామ్... టీమిండియా టెస్టు టెంపరరీ కెప్టెన్‌పై...

First Published Nov 25, 2021, 3:45 PM IST

టీమిండియా టెస్టు సారథి విరాట్ కోహ్లీ, రెస్టు తీసుకోవడంతో టెంపరరీ కెప్టెన్‌గా బాధ్యతలు అందుకున్నాడు అజింకా రహానే. ఆసీస్ టూర్‌లో కెప్టెన్‌గా అదరగొట్టిన రహానే, కాన్పూర్‌లో జరుగుతున్న తొలి టెస్టుకి సారథిగా వ్యవహరిస్తున్నాడు...

ఆస్ట్రేలియా టూర్‌లో మెల్‌బోర్న్ టెస్టులో సెంచరీ చేసిన అజింకా రహానే, ఆ తర్వాత వరుసగా విఫలమవుతూ దారుణమైన ట్రోల్స్‌ ఎదుర్కొంటున్నాడు...

కాన్పూర్ టెస్టులో టూ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన అజింకా రహానే, 63 బంతుల్లో 6 ఫోర్లతో 35 పరుగులు చేసి కేల్ జెమ్మీసన్ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు...

ఈ ఏడాది 20 ఇన్నింగ్స్‌లు ఆడిన అజింకా రహానే, 20.35 సగటుతో 407 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్‌కి ముందు 2021లో రహానే టెస్టు సగటు 20 కూడా దాటలేదు...

ఓ ఏడాది 20 ఇన్నింగ్స్‌ల పాటు బ్యాటింగ్ చేసిన టాప్ 7 బ్యాట్స్‌మెన్‌లో అతి తక్కువ సగటు నమోదుచేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా టాప్‌లో నిలిచి, చెత్త రికార్డు నమోదు చేశాడు అజింకా రహానే...

2001లో పేలవమైన ఫామ్‌తో తీవ్రమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ, 22.20 సగటుతో పరుగులు చేశాడు. అజింకా రహానే, గంగూలీ కంటే పేలవ రికార్డు నమోదుచేసి,చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు..

టెస్టుల్లో చోటు కోల్పోకముందు 2018లో కెఎల్ రాహుల్ 22.28 సగటుతో పరుగులు చేయగా, ఛతేశ్వర్ పూజారా 2014లో 24.15 సగటుతో పరుగులు చేసి టాప్ 4లో నిలిచాడు..

1983లో అన్షుమాన్ గైక్వాడ్‌ 28.62 సగటుతో పరుగులు చేసి టాప్‌ 5లో ఉండగా, 2018 ఏడాదిలోనూ అజింకా రహానే 30.66 సగటుతో పరుగులు చేసి టాప్ 6లో ఉన్నాడు...

70కి పైగా టెస్టులు ఆడిన భారత టాపార్డర్ బ్యాట్స్‌మెన్లలో అతి తక్కువ సగటు కలిగిన భారత బ్యాట్స్‌మెన్ అజింకా రహానే. 6 అంతకంటే పైన స్థానాల్లో బ్యాటింగ్ చేసే భారత బ్యాట్స్‌మెన్లలో 70కి పైగా టెస్టులు ఆడిన అందరూ 40+ సగటుతో పరుగులు చేశారు...

అజింకా రహానే సగటు 36.02+ గా ఉంది. 90 టెస్టుల్లో 38.06 సగటుతో 4876 పరుగులు చేసిన ఎమ్మెస్ ధోనీ కూడా రహానే కంటే మెరుగైన సగటుతో పరుగులు చేశాడు...

click me!