Harshal Patel: అలా మొదలైంది.. ఇలా కొనసా...గుతోంది.. సూపర్ ఫోటో షేర్ చేసిన హర్షల్ పటేల్

Published : Nov 25, 2021, 03:33 PM IST

Ind Vs Nz: లేటు వయసులో  టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినా రెండు మ్యాచులతోనే తానెంత విలువైన ఆటగాడో  నిరూపించుకున్నాడు హర్షల్ పటేల్. ఆఖరు ఓవర్లలో స్లో బంతులతో ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టే ఈ గుజరాతీ.. తాజాగా షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట వైరల్ అవుతున్నది. 

PREV
17
Harshal Patel: అలా మొదలైంది.. ఇలా కొనసా...గుతోంది.. సూపర్ ఫోటో షేర్ చేసిన హర్షల్ పటేల్

ఇటీవల న్యూజిలాండ్ తో ముగిసిన మూడు మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా జట్టులో అనూహ్యంగా చోటు దక్కించుకున్న హర్షల్ పటేల్ అదిరిపోయే ప్రదర్శనతో  తుది జట్టులో చోటు కన్ఫర్మ్ చేసుకున్నాడు.  బౌలింగ్ తో పాటు ఆఖరు మ్యాచ్ లో అతడి బ్యాటింగ్ సామర్థ్యం కూడా అభిమానులను ఆకట్టుకున్నది. 
 

27

కాగా.. తాజాగా అతడు షేర్ చేసిన ఓ ఫోటో ఇప్పుడు  సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతున్నది. ఇన్స్టాగ్రామ్ వేదికగా హర్షల్ రెండు ఫోటోలను షేర్ చేశాడు. ఆ రెండూ ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో ఉన్నవే.. 

37

ఈ  రెండు ఫోటోలను షేర్ చేస్తూ హర్షల్.. ‘ఎలా మొదలైంది... ఎలా కొనసాగుతోంది’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫోటోలకు పలువురు అభిమానులు.. ‘ద్రవిడ్ నమ్మకాన్ని గెలవడమే కాదు.. దానిని నిలబెట్టుకున్నావ్’ అని కామెంట్స్ చేస్తున్నారు. 

47

లేటు వయసు (30 ఏండ్లు)లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చినా హర్షల్ పటేల్ మాత్రం సెలెక్టర్లు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయలేదు.  న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20లో ఆడిన హర్షల్.. 

57

నెల రోజుల క్రితం దుబాయ్ లో ముగిసిన ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన హర్షల్.. ఆ టోర్నీలో అత్యధిక వికెట్లు తీశాడు. ఆ మ్యాచులో అతడు నాలుగు ఓవర్లు వేసి  25 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. 

67

ఇక ఈడెన్ గార్డెన్ లో జరిగిన మూడో టీ20లో కూడా బాల్ తోనే గాక  బ్యాట్ తో కూడా రాణించాడు హర్షల్ పటేల్. ఆ మ్యాచ్ లో 11 బంతుల్లోనే 18 పరుగులు చేశాడు. అందులో రెండు ఫోర్లు, ఒక సిక్స్ కూడా ఉంది. హిట్ వికెట్ గా వెనుదిరిగి ఉండకుంటే హర్షల్ ఇంకా ఎక్కువ పరుగులు సాధించేవాడు. అదే  మ్యచ్ లో బౌలింగ్ చేసిన అతడు.. మూడు ఓవర్లు వేసి 26 పరుగులిచ్చి 2 వికెట్లు కూడా తీశాడు. 

77

ఇక దుబాయ్ లో ముగిసిన ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్  బెంగళూరు తరఫున ఆడిన హర్షల్.. ఏకంగా ఆ సీజన్ లో పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. ఈ సీజన్ లో 15 మ్యాచులాడిన హర్షల్.. 32 వికెట్లు పడగొట్టాడు. ముంబై ఇండియన్స్ తో మ్యాచ్ లో హ్యట్రిక్ కూడా నమోదు చేసిన విషయం తెలిసిందే. 

Read more Photos on
click me!

Recommended Stories