IPL Retention 2025: అన్ని ఐపీఎల్ జట్లు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల పూర్తి జాబితా ఇదిగో

First Published | Oct 31, 2024, 10:41 PM IST

Full List Of Players Retained By All IPL Teams: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) మెగా వేలానికి ముందు మొత్తం 10 ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను అధికారికంగా ప్రకటించాయి. నిబంధనల ప్రకారం ఫ్రాంచైజీలు తమ ఐపీఎల్ 2024 జట్టు నుండి ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. టీమ్స్ మొత్తం రిటైన్ చేసుకున్న ప్లేయ‌ర్ల వివ‌రాలు ఇలా ఉన్నాయి.. 
 

IPL Retention 2025, Dhoni, Hardik

1. చెన్నై సూపర్ కింగ్స్ (CSK)

చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఐదు టైటిళ్లను గెలుచుకుని విజ‌య‌వంత‌మైన జ‌ట్టుగా కొన‌సాగుతోంది. వేలం వ్యూహాలతో చాలా స్పష్టంగా ఉండే సీఎస్కే IPL 2025 మెగా వేలానికి ముందు రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, మతీషా పతిరానా, శివమ్ దూబేలను రిటైన్ చేసుకున్నారు. అలాగే, అన్‌క్యాప్డ్ కేటగిరీలో లెజెండ‌రీ ప్లేయ‌ర్ ఎంఎస్ ధోనిని కూడా జ‌ట్టుతోనే ఉంచుకుంది.

CSK రిటైన్ ప్లేయ‌ర్లు : రవీంద్ర జడేజా-18 కోట్లు, రుతురాజ్ గైక్వాడ్ - 18 కోట్లు, మతీషా పతిరణ - 13 కోట్లు, శివమ్ దూబే - 12 కోట్లు, MS ధోని - 4 కోట్లు

2. ముంబై ఇండియన్స్ (MI)

ముంబై ఇండియన్స్ (MI) ఐదు సార్లు ఐపీఎల్ టైటిల్ ను గెలుచున్న మరో టీమ్. అయితే గత కొన్ని సీజన్‌లలో దారుణ ప్ర‌ద‌ర్శ‌న చేస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్ ఫ్రాంచైజీకి భయంకరంగా మారింది. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఈ టీమ్ 10వ స్థానంలో నిలిచింది. అయితే, రాబోయే సీజ‌న్ కోసం రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలను రిటైన్ చేసుకుంది. 

MI రిటైన్ ప్లేయ‌ర్లు : రోహిత్ శర్మ - 16.30 కోట్లు, హార్దిక్ పాండ్యా - 16.35 కోట్లు, జస్ప్రీత్ బుమ్రా - 18 కోట్లు, సూర్యకుమార్ యాదవ్ - 16.35 కోట్లు, తిలక్ వర్మ - 8 కోట్లు

Sanju Samson

3. కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మొత్తంగా మూడు ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకుంది. రాబోయే సీజ‌న్ కోసం ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, రింకు సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, రమణదీప్ సింగ్ ల‌తో ఆరు రిటెన్షన్‌లను పూర్తి చేసింది. అయితే,  తమ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను ఆశ్చర్యకరంగా వదులుకుంది. 

KKR రిటైన్ ప్లేయ‌ర్లు : ఆండ్రీ రస్సెల్ - 12 కోట్లు, సునీల్ నరైన్ - 12 కోట్లు, రింకు సింగ్ - 13 కోట్లు, వరుణ్ చక్రవర్తి - 12 కోట్లు, హర్షిత్ రానా - 4 కోట్లు, రమణదీప్ సింగ్ - 4 కోట్లు.

4. రాజస్థాన్ రాయల్స్ (RR)

రాజస్థాన్ రాయల్స్ (RR) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ప్రారంభ సీజ‌న్ విజేత‌. గత కొన్ని సీజ‌న్ల నుంచి మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తోంది. రాబోయే సీజ‌న్ కోసం కెప్టెన్ సంజూ శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, సందీప్ శర్మలను రిటైన్ చేసుకుంది. ప‌లువురు స్టార్ ప్లేయ‌ర్ల‌కు షాకిచ్చింది. 

RR రిటైన్ ప్లేయ‌ర్ల లిస్టు  : సంజు శాంసన్ - 18 కోట్లు, యశస్వి జైస్వాల్ - 18 కోట్లు, రియాన్ పరాగ్ - 14 కోట్లు, ధృవ్ జురెల్ - 14 కోట్లు, షిమ్రోన్ హెట్మెయర్ - 11 కోట్లు, సందీప్ శర్మ - 4 కోట్లు.


Sunrisers Hyderabad, SRH, IPL , IPL 2025, Sunrisers Hyderabad IPL 2025 Retention Players

5. సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH)

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 ఫైనలిస్ట్ అయిన హైద‌రాబాద్ టీమ్ రాబోయే సీజ‌న్ కోసం ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ లు ఆడే ప్లేయ‌ర్ల‌ను రిటైన్ చేసుకుంది. కెప్టెన్ పాట్ కమ్మిన్స్ తో పాటు హెన్రిచ్ క్లాసెన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, నితీష్ రెడ్డిల‌ను జ‌ట్టుతో ఉంచుకుంది.

SRH రిటైన్ ప్లేయ‌ర్లు వీరే : హెన్రిచ్ క్లాసెన్ - 23 కోట్లు, పాట్ కమిన్స్ - 18 కోట్లు, అభిషేక్ శర్మ - 14 కోట్లు, ట్రావిస్ హెడ్ - 14 కోట్లు, నితీష్ రెడ్డి - 6 కోట్లు.

6. గుజరాత్ టైటాన్స్ (GT)

గుజరాత్ టైటాన్స్ (GT) వారి తొలి సీజన్‌లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ట్రోఫీని గెలుచుకుని చ‌రిత్ర సృష్టించింది. ఆ తర్వాత IPL 2023లో ఫైనల్‌కు అర్హత సాధించింది. అయితే, IPL 2024లో పేలవమైన ప్ర‌ద‌ర్శ‌న‌తో 8వ స్థానంలో నిలిచారు. రాబోయే సీజ‌న్ కోసం స్టార్ ఆల్ రౌండర్ రషీద్ ఖాన్‌, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్‌లతో పాటు తమ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను రిటైన్ చేసుకుంది. 

గుజ‌రాత్ టైటాన్స్ రిటెన్ష‌న్లు: రషీద్ ఖాన్ - 18 కోట్లు, శుభమాన్ గిల్ - 16.5 కోట్లు, సాయి సుదర్శన్ - 8.5 కోట్లు, రాహుల్ తెవాటియా- 4 కోట్లు, షారుక్ ఖాన్ - 4 కోట్లు.

7. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) కు ఐపీఎల్ లో మ‌స్తు క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను క‌లిగివుంది. కానీ ఇప్ప‌టివ‌ర‌కు టైటిల్ ను గెలుచుకోలేక‌పోయింది. రాబోయే సీజ‌న్ లో విరాట్ కోహ్లీకి కెప్టెన్సీని అప్పగించ‌నుంద‌ని స‌మాచారం. విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, యష్ దయాల్‌లను ఆర్సీబీ రిటైన్ చేసుకుంది. 

RCB రిటైన్ ప్లేయ‌ర్లు : విరాట్ కోహ్లీ - 21 కోట్లు, రజత్ పాటిదార్ - 11 కోట్లు, యష్ దయాల్ - 5 కోట్లు

8. ఢిల్లీ క్యాపిటల్స్ (DC)

ఢిల్లీ క్యాపిటల్స్ (DC) ఐపీఎల్ లో బ‌ల‌మైన జ‌ట్ల‌లో ఒక‌టిగా ముందుకు సాగుతోంది. కానీ, ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్ టైటిల్ ను గెలవ‌లేదు. కెప్టెన్ రిషబ్ పంత్ జ‌ట్టు నుంచి విడిపోయాడు. రాబోయే సీజ‌న్ కోసం అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్‌లను రిటైన్ చేసుకుంది ఢిల్లీ టీమ్. రాబోయే సీజ‌న్ లో శ్రేయాస్ అయ్యర్ డీసీకి కెప్టెన్ గా రాబోతున్నార‌ని స‌మాచారం. 

ఢిల్లీ క్యాపిట‌ల్స్ రిటైన్ ప్లేయ‌ర్లు : అక్షర్ పటేల్ - 16.5 కోట్లు, కుల్దీప్ యాదవ్ - 13.25 కోట్లు, ట్రిస్టన్ స్టబ్స్ - 10 కోట్లు, అభిషేక్ పోరెల్ - 4 కోట్లు

Yuvraj Singh, Nicholas Pooran

9. పంజాబ్ కింగ్స్ (PBKS)

పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్ వేలంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ జ‌ట్టులో స‌మూల మార్పులు చేస్తుంది. ఈ సారి కూడా అదే ప్లాన్ తో ముందుకు సాగుతున్న‌ట్టు స్ప‌ష్టం చేసింది. అందుకే జ‌ట్టులోని అంద‌రూ స్టార్ ప్లేయ‌ర్ల‌ను వ‌దులుకుని అన్‌క్యాప్డ్ లిస్టులో శశాంక్ సింగ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్‌లను మాత్ర‌మే రిటైన్ చేసుకుంది. 

పంజాబ్ కింగ్స్ రిటెన్ష‌న్ లిస్టు : శశాంక్ సింగ్ - 5.5 కోట్లు, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ - 4 కోట్లు

10. లక్నో సూపర్ జెయింట్స్ (LSG)

లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) తమ కెప్టెన్ కెఎల్ రాహుల్ వ‌దులుకోవ‌డంతో వేలానికి ముందు పెద్ద మార్పుకు చూసింది. కేఎల్ రాహుల్ ఔట్ కావ‌డంతో నికోలస్ పూరన్ టాప్ రిటెన్షన్‌గా జట్టులో ఉన్నాడు. అత‌నితో పాటు మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్, మొహ్సిన్ ఖాన్, ఆయుష్ బడోనీల‌ను ల‌క్నో టీమ్ రిటైన్ చేసుకుంది. 

లక్నో సూపర్ జెయింట్స్ (LSG) రిటైన్ లిస్టు: నికోలస్ పూరన్ - 21 కోట్లు, మయాంక్ యాదవ్ - 11 కోట్లు, రవి బిష్ణోయ్ - 11 కోట్లు, మొహ్సిన్ ఖాన్ - 4 కోట్లు, ఆయుష్ బదోని - 4 కోట్లు

Latest Videos

click me!