CSK vs RCB: ధోని మెరుపు స్టంపింగ్.. వీడియో ఇదిగో
IPL 2025, CSK vs RCB: ఐపీఎల్ 2025లో మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) స్టార్ ఎంఎస్ ధోని తన మెరుపు వికెట్ కీపింగ్ ప్రదర్శనతో దుమ్మురేపాడు. మరోసారి అద్భుతమైన స్టంపౌట్ తో ఆర్సీబీకి షాకిచ్చాడు.
IPL 2025, CSK vs RCB: ఐపీఎల్ 2025లో మరోసారి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) స్టార్ ఎంఎస్ ధోని తన మెరుపు వికెట్ కీపింగ్ ప్రదర్శనతో దుమ్మురేపాడు. మరోసారి అద్భుతమైన స్టంపౌట్ తో ఆర్సీబీకి షాకిచ్చాడు.
MS Dhoni: ప్రపంచ రికార్డు మెరుపు వేగం.. కళ్లు చెదిరే స్టంపింగ్.. అదికూడా 43 ఏళ్ల వయస్సులో సాధ్యమేనా? అంటే సాధ్యమే అని చెబుతున్నాడు భారత మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ మహేంద్ర సింగ్ ధోని.
అవును ధోని గ్రౌండ్ లోకి అడుగు పెట్టాడంటే కేవలం హెలికాప్టర్ సిక్సర్లు మాత్రమే కాదు.. కళ్లు చెదిరే మెరుపు స్టంపింగ్ లు కూడా ఉంటాయి. ఐపీఎల్ లో అత్యధిక వయస్సు కలిగిన.. అన్ క్యాప్డ్ ప్లేయర్ గా ఆడుతున్న ధోని అద్భుతమైన స్టంపింగ్స్ తో అదరగొడుతున్నాడు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025లో 8వ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)-ఎంఎస్ ధోని టీమ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లు చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన చెన్నై టీమ్ బౌలింగ్ ఎంచుకుంది.
ఈ క్రమంలోనే ఎంఎస్ ధోని మరోసారి మెరుపు స్టంపింగ్స్ తో అదరగొట్టాడు. నూర్ అహ్మద్ బౌలింగ్ లో ధోని మెరుపు వేగంతో ఫిల్ స్టాల్ట్ ను స్టంప్ చేసి అవుట్ చేశాడు. కేవలం 0.141 సెకండ్స్ లో ఈ స్టంపింగ్స్ ను పూర్తి చేశాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ధోని ఈ మ్యాచ్ కు ముందు కూడా ఐపీఎల్ 2025లో అద్భుతమైన స్టంపింగ్ తో రికార్డు సాధించాడు. చెన్నై సూపర్ కింగ్స్-ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో మెరుపు వేగంలో రెండో అత్యంత వేగవంతమైన స్టంపింగ్ ను చేశాడు.
ముంబై స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌ను కేవలం 0.12 సెకన్లలోనే స్టంపింగ్ తో పెవిలియన్ కు పంపాడు. ఇది ఐపీఎల్ హిస్టరీలో అత్యంత వేగవంతమైన రెండో స్టంపింగ్ రికార్డుగా నిలిచింది.
ఐపీఎల్ లో అత్యంత వేగవంతమైన స్టపింగ్ రికార్డడు కూడా ధోనినే సాధించాడు. ఐపీఎల్ 2023 ఎడిషన్ లో ఫైనల్‌లో గుజరాత్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌ను కేవలం 0.1 సెకన్లలోనే కళ్లు చెదిరే స్టంపింగ్ తో అవుట్ చేసి రికార్డుల మోత మోగించాడు.
ఇది మాత్రమే కాదు ప్రపంచ క్రికెట్‌లోనూ ఫాస్టెస్ట్ స్టంపింగ్ రికార్డు కూడా ధోని పేరిటే ఉంది. 2018లో వెస్టిండీస్‌కి చెందిన కీమో పాల్‌ను 0.08 సెకన్లలో స్టంపింగ్ లో పెవిలియన్ కు పంపాడు ధోని.