IPL : ఐపీఎల్ లో కింగ్ కోహ్లీ మరో రికార్డు.. సీఎస్కేకు చుక్కలు చూపించాడు !
IPL 2025, CSK vs RCB: రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లో మరో ఘనత సాధించాడు.
IPL 2025, CSK vs RCB: రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ లో రికార్డుల మోత మోగిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లో మరో ఘనత సాధించాడు.
IPL 2025, CSK vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మరో బిగ్ ఫైట్ చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ లో రన్ మిషన్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. ఇప్పటికే అనేక రికార్డులు సాధించిన కింగ్ కోహ్లీ.. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో మరో మంచి ఇన్నింగ్స్ ను ఆడాడు.
శుక్రవారం MA చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ ( CSK ) తో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) IPL 2025 మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ మొదట పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు కానీ, ఊపందుకున్న తర్వాత బిగ్ షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు. అయితే, 30 బంతుల్లో 31 పరుగులు తన ఇన్నింగ్స్ తో శిఖర్ ధావన్‌ను అధిగమించి ఐపీఎల్ చరిత్రలో చెన్నై సూపర్ కింగ్స్ పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
ఈ ఇన్నింగ్స్‌తో విరాట్ కోహ్లీ చెన్నై సూపర్ కింగ్స్ పై 1,084 పరుగులు చేశాడు. శిఖర్ ధావన్ సాధించిన 1,057 పరుగుల రికార్డును అధిగమించాడు. కోహ్లీ ఈ మైలురాయిని చేరుకోవడానికి 34 మ్యాచ్‌ల్లో 33 ఇన్నింగ్స్‌లను తీసుకున్నాడు. అయితే, శిఖర్ ధావన్ మాత్రం కేవలం 29 ఇన్నింగ్స్‌లలో ఈ రికార్డును సృష్టించాడు. అలాగే, ఐపీఎల్ చరిత్ర లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) పై 1,000 పరుగుల మార్కును దాటిన ఏకైక బ్యాట్స్‌మెన్లు విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్ మాత్రమే.
ఇక ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ చెన్నై సూపర్ కింగ్స్ పై 90 పరుగుల అత్యధిక వ్యక్తిగత పరుగుల అజేయ ఇన్నింగ్స్ ను ఆడాడు. అలాగే, సీఎస్కే పై కోహ్లీ 9 హాఫ్ సెంచరీలు కూడా సాధించాడు. 37.37 సగటు, 125.46 స్ట్రైక్ రేట్‌తో కోహ్లీ ఈ పరుగులు సాధించాడు. అయితే, శిఖర్ ధావన్ ఖాతాలో ఒక సెంచరీ (101*), ఎనిమిది అర్ధ సెంచరీలు ఉన్నాయి.
చెన్నై సూపర్ కింగ్స్ పై అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల లిస్టులో రోహిత్ శర్మ మూడో స్థానంలో ఉన్నాడు. అతను 35 మ్యాచ్‌ల్లో 896 పరుగులు చేశాడు. ఆ తర్వాత దినేష్ కార్తీక్ 33 మ్యాచ్‌ల్లో 727 పరుగులతో నాల్గో స్థానంలో ఉన్నాడు. ఐదో స్థానంలో ఉన్న డేవిడ్ వార్నర్ 21 మ్యాచ్‌ల్లో 696 పరుగులు చేశాడు.